delhi jail covid: ఢిల్లీ జైళ్లలో కరోనా కలకలం...170కిపైగా కేసులు నమోదు!

Delhi: దేశరాజధాని ఢిల్లీ జైళ్లలో కరోనా విజృంభిస్తోంది.నగరంలోని వివిధ జైళ్లలో ఇప్పటివరకు 90 మందికిపైగా ఖైదీలు, 80 మందికిపైగా అధికారులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 02:47 PM IST
  • ఢిల్లీ జైళ్లలో కరోనా విజృంభణ
  • 90 మందికి పైగా ఖైదీలకు కరోనా
  • 80 మందికిపైగా జైలు అధికారులకు వైరస్ నిర్ధారణ
delhi jail covid: ఢిల్లీ జైళ్లలో కరోనా కలకలం...170కిపైగా కేసులు నమోదు!

Covid-19 in Delhi Jails: ఢిల్లీలోని జైళ్లలో కరోనా కలకలం రేగింది. నగరంలోని వివిధ జైళ్లలో 90 మందికి పైగా ఖైదీలు, 80 మందికిపైగా జైలు అధికారులు కొవిడ్ (Covid-19 at prisons) బారిన పడ్డారు. దీంతో దిల్లీలోని జైళ్లలోనే 50-100 పడకల మెడికల్‌ సెంటర్లను జైళ్ల శాఖ ఏర్పాటు చేస్తోంది. కొవిడ్‌ సోకిన ఖైదీలకు (delhi jail covid) అక్కడే చికిత్స అందిస్తున్నారు. తాజాగా వైరస్‌ సోకిన వారిలో చాలా మంది ఖైదీలకు జైలు డాక్టర్లే చికిత్స చేస్తున్నారు. 

డిసెంబర్‌ నుంచి జనవరి 15 మధ్యలో తిహార్, రోహిణి, మండోలి జైళ్లలో 99 మంది ఖైదీలకు, 88 మంది అధికారులకు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీనిపై జైళ్ల శాఖ డీజీ సందీప్‌ గోయల్‌ (Sandeep Goel) స్పందించారు. ‘''కరోనా కేసులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. ఇప్పటివరకు తీవ్రమైన లక్షణాలతో ఎటువంటి కేసులు రాలేదు. వ్యాధి సోకిన వారికి జైలు డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు''’ అని గోయల్ పేర్కొన్నారు. 

Also Read: Harak Singh Rawat: కేబినెట్ నుంచి తొలగించడంపై కన్నీటి పర్యంతమైన మంత్రి, వీడియో వైరల్

జైలు డిస్పెన్సరీలను ఇప్పటికే కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మారుస్తున్నారు. తిహార్ జైల్లోని (Tihar Jail) 120 పడకల ఆసుపత్రిలో కేవలం కొవిడ్‌ రోగులకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. రోగుల కోసం తీహార్ జైలులో ఆక్సిజన్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. కరోనా రోగుల కోసం మండోలి, రోహిణి జైలులో 40-50 పడకలు కూడా కేటాయించారు. అదే విధంగా సిబ్బందికి కూడా క్రమం తప్పకుండా పరీక్షలు చేస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News