Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 120 మంది వైద్యులకు పాజిటివ్‌

Gandhi Hospital: తెలంగాణలోని ఆస్పత్రుల్లో భారీ సంఖ్యలు కరోన కేసులు బయటపడుతున్నాయి. తాజాగా గాంధీ, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలోని పలువురు వైద్యులు, సిబ్బంది, రోగులు కొవిడ్ బారిన పడ్డారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 06:48 PM IST
  • తెలంగాణలో కోరలు చాస్తోన్న కరోనా
  • గాంధీలో 120 మంది సిబ్బందికి పాజిటివ్
  • ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో 66 మందికి వైరస్
Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం.. 120 మంది వైద్యులకు పాజిటివ్‌

120 COVID 19 Positive Cases in Gandhi Hospital: తెలంగాణలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. తాజాగా గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. వైద్యులపైనే ఈ మహమ్మారి పంజా విసిరింది. తాజాగా 120 మంది వైద్యులకు కొవిడ్ పాజిటివ్ గా (Covid Cases in Gandhi Hospital) నిర్దారణ అయింది. వీరిలో 40 మంది పీజీ విద్యార్థులు, 38 మంది హౌస్‌ సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు ఫ్యాకల్టీలు ఉన్నారు. మరికొంత మంది డాక్టర్లు, సిబ్బందికి సంబంధించిన కరోనా టెస్ట్‌ రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో గాంధీ ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది, రోగుల్లో ఆందోళన మొదలైంది.

ఎర్రగడ్డ ఆస్పత్రిలో కరోనా విజృంభణ
ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో (erragadda Hospital) కరోనా విజృంభించింది. 57 మంది రోగులకు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు. కాగా, పలు పోలీస్ స్టేషన్లలో కూడా అధిక సంఖ్యలో సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్‌లో 16 మందికి, యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పీఎస్‌లో 12 మంది సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయింది.

Also Read: Telangana Cabinet Meeting : కరోనా విషయంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటాం : మంత్రి హరీశ్‌రావు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News