జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత ఆర్భాటంగా తీర్చిదిద్దుకున్న ఎన్నికల ప్రచారరథం ఊహించినట్టే అభాసుపాలైంది. అయితే ఈ వాహనం రంగు, ఇతర విషయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ట్రోలింగ్‌తో వివాదం రాజుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2024 ఎన్నికల ప్రచారం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ ఓ ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. దానికి వారాహి అంటూ పేరు పెట్టారు. అత్యాధునిక టెక్నాలజీతో, మెరుగైన హంగులతో వారాహి వాహనం సిద్ధమైంది. హైదరాబాద్‌లో ఈ వాహనాన్ని ప్రత్యేకంగా చేయించారు. అయితే ఈ వాహనానికి వాడిన రంగు వివాదాస్పదమైంది. మిలటరీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్ రంగును వాడటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా వైసీపీ నేతలు ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ క్రమంలో వైసీపీ, జనసేన నేతల మద్య మాటల యుద్ధం జరిగింది. 


వాస్తవానికి మోటార్ వెహికల్ చట్టం 1989 ఛాప్టర్ 121 ప్రకారం ఇండియన్ డిఫెన్స్ విభాగం తప్ప మరెవరూ అంటే ప్రైవేటు వ్యక్తులెవరూ ఆలీవ్ గ్రీన్ రంగు వాడకూడదు. ఈ విషయంపై విమర్శలు చెలరేగుతుండగానే..పవన్ కళ్యాణ్ వారాహి వాహనం రిజిస్ట్రేషన్ కాస్తా నిలిచిపోయింది. లారీ ఛాసిస్‌ను బస్సుగా మార్చడం, వాహనం ఎత్తు ఎక్కువగా ఉండటం, మైన్స్‌లో వాడాల్సిన వాహన టైర్లను రోడ్లపై వాడటం, ఆర్మీకు సంబంధించిన రంగును సివిల్ వాహనానికి వాడటం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ విభాగం తెలిపింది. 


ఇవన్నీ మార్చుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేయగలమని తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పవన్ కళ్యాణ్ వారాహి వాహన రిజిస్ట్రేషన్ వాయిదా పడింది. 


Also read: Pawan Kalyan Martial Arts: మిస్టర్ ప్యాకెజీ స్టార్.. ఏంటి ఈ హౌలే వేషాలు.. పవన్‌పై వైసీపీ నేత సెటైర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook