Corona in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా 3,877 మందికి పాజిటివ్​గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం శుక్రవారం సాయంత్రం వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తం 1,01,812 టెస్టులకుగానూ.. ఈ కేసులు (Telangana Corona update) నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే టెస్టుల సంఖ్య మరింత పెరిగింది.


ఇందులో 1,189 కేసులు ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే రావడం (Corona cases in GHMC) ఆందోళనకరం. ఆ తర్వాత మేడ్చల్​ జిల్లాలో అత్యధికంగా 348 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.


గురువారం సాయంత్రం ఐదున్నర నుంచి నేడు (శుక్రవారం) సాయంత్రం 5:30 వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.


రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 7,54,976 వద్దకు చేరింది.


రాష్ట్రంలో కరోనా రికవరీలు..


ఇక గడిచిన 24 గంటల్లో 2,981 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,10,479 మంది కరోనాను (Corona recoveries in Telangana) జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.20 శాతానికి తగ్గింది.


మహమ్మారికి రాష్ట్రంలో తాజాగా ఇద్దరు బలయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,083కు చేరినట్లు (Corona deaths in Telangana) ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.54 శాతంగా ఉంది.


తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 40,414 యాక్టివ్​ కొవిడ్ కేసులు (Corona Acitve cases in Telangana) ఉన్నాయి.



రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,18,77,830 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,56,470 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 4,006 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి ఉందని (Corona tests in Telangana) పేర్కొంది.


Also read: MP Arvind: ఎంపీ అరవింద్‌కు లోక్‌సభ స్పీకర్ ఫోన్.. ఇటీవలి దాడిపై ఆరా...


Also read: KCR on Drugs isuue: తెలంగాణ నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా త‌రిమేద్దామన్న సీఎం కేసీఆర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook