తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. గత నెలలో ప్రతిరోజూ రెండు, మూడొందల పాజిటివ్ నమోదయ్యేవి. ఏప్రిల్ నెలలో రోజుకూ 3 వేల పైగా కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 3,307 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,38,045కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ గురువారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,06,627 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా... అందులో 3 వేల 3 వందల ఏడు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 38 వేల 45కి చేరింది. కరోనా మహమ్మారితో పోరాడుతూ రాష్ట్రంలో మరో ఎనిమిది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,788కి చేరింది. గత నెలలో ప్రతిరోజూ రెండు, మూడు కరోనా మరణాలు నమోదయ్యేవి. తాజాగా ప్రతిరోజూ ఏడు, ఎనిమిది మందిని కరోనా బలితీసుకుంటోంది.


Also Read: Covid Vaccination: ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ నిలిపివేసిన డెన్మార్క్ దేశం


మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. కోవిడ్19 నిబంధనలు కఠినతరం చేసింది. బుధవారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19(Covid-19) నుంచి 897 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,08,396 మంది కరోనా మహమ్మారిని జయించారు. 


తెలంగాణలో అత్యధిక కోవిడ్-19 పాజిటివ్ కేసులు  జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో 446 కరోనా కేసులు నిర్ధారణ కావడం హైదరాబాద్ నగర వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 27 వేల 861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం క్వారంటైన్‌లో 16,685 మంది చికిత్స పొందుతున్నారు.


Also Read: Corona second wave: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా సెకండ్ వేవ్ కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook