Covid Vaccination: ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ నిలిపివేసిన డెన్మార్క్ దేశం

Covid Vaccination: ప్రపంచమంతా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్ దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాక్సిన్‌ల వినియోగాన్ని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశం. ఆ వ్యాక్సిన్‌లు ఏమిటి..ఆ దేశం పేరేంటి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 15, 2021, 01:01 PM IST
Covid Vaccination: ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ నిలిపివేసిన డెన్మార్క్ దేశం

Covid Vaccination: ప్రపంచమంతా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్ దృష్టిలో ఉంచుకుని ఆ వ్యాక్సిన్‌ల వినియోగాన్ని నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆ దేశం. ఆ వ్యాక్సిన్‌లు ఏమిటి..ఆ దేశం పేరేంటి.

కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) ఓ వైపు కోరలు చాస్తోంది. ప్రపంచమంతా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో డెన్మార్క్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. కోవ్యాగ్జిన్, కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్( Oxford-Astrazeneca vaccine) వినియోగాన్ని యూరోపియన్ దేశమైన డెన్మార్క్ పూర్తిగా నిలిపివేసింది. ఈ వ్యాక్సిన్ వల్ల చాలా అరుదైన సైడ్‌ఎఫెక్ట్స్ ఉన్నట్టు డెన్మార్క్ (Denmark ) స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ లేకుండానే డెన్మార్క్ దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుందని ఆ దేశ ఆరోగ్య శాఖ డైరెక్టర్ సోరెన్ బ్రోస్ట్రోమ్ వెల్లడించారు. 

ఆస్ట్రాజెనెకా- ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్(Astrazeneca-oxford vaccine) ఉపయోగించవచ్చని..ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO), యూరోపియన్ డ్రగ్ కంట్రోలర్ చెప్పినా సరే డెన్మార్క్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్లేట్‌లెట్స్ సంఖ్య తక్కువగా ఉండటం, వ్యాక్సిన్‌కు మధ్య క్రాస్ రియాక్షన్ ఉందని ఆయన తెలిపారు. డెన్మార్క్‌లో ఇప్పటికే అందరికీ దాదాపు వ్యాక్సిన్ వేశామన్నారు. కరోనా వైరస్ దేశంలో నియంత్రణంలో ఉందని చెప్పారు. 

Also read: COVID-19 Cases India: భారత్ ప్రయాణికులపై నిషేధం విధించిన న్యూజిలాండ్, కోవిడ్19 భయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News