తెలంగాణలో గత కొన్ని రోజులుగా కోవిడ్19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మొన్న ఒక్కరోజు స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు క్రమక్రమంగా భారీగా నమోదవుతున్నాయి. తెలంగాణలో తాజాగా 684 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,889కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 56,122 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో ఆరు వందల ఎనభై నాలుగు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 7 వేల 8 వందల ఎనభై తొమ్మిదికి చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో ముగ్గురు వ్యక్తులు మరణించారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణ(Telangana)లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,697కి చేరింది.


Also Read: Internet Speed: వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఇక 4G వేగంతో  ఇంటర్నెట్


గత కొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరిగింది. మంగళవారం ఒక్కరోజు 394 మంది చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,01,227 మంది కరోనా మహమ్మారిని జయించారు. 


జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికం అవుతుంది.  కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC)లోనే ఏకంగా 184 నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా(CoronaVirus) సెకండ్ సేవ్ కారణంగా హాస్టళ్లు, మెస్‌లు సైతం మూసివేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,965 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 1,873 మంది చికిత్స పొందుతున్నారు.


Also Read: Gold Price Today 31 March 2021: మార్కెట్‌లో మళ్లీ పతనమైన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు 


https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook