Huge quantity of Ganja Seized in Warangal: వరంగల్‌లో అంతర్ రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.57 లక్షల 40 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న లారీని సీజ్‌ చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా కాగితం తయారీకి ఉపయోగించే నీలగిరి కర్రల్లో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్రా నుంచి ఇతర రాష్ట్రాలకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు వరంగల్ సీపీ తరుణ్ జోషీ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ముఠాకు చెందిన మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. నిందితులంతా మొదట ట్రాన్స్‌పోర్ట్ లారీలో కర్ణాటక నుంచి రాజమండ్రికి పౌల్ట్రీ  ఉత్పత్తులను తరలించినట్లు చెప్పారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై పక్కా సమాచారంతో తనిఖీలు నిర్వహించి గంజాయి ముఠాను పట్టుకున్నట్లు వెల్లడించారు.


మూడు రోజుల క్రితం ఇదే వరంగల్‌లో ఆంధ్రా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ఎనిమిది మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముఠా నుంచి రూ.7.65 లక్షల విలువైన 52 కిలోల గంజాయితో పాటు, కారు, ఆటో, ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏటూరు నాగారం, ములుగు మీదుగా హనుమకొండకు వస్తుండగా నీరుకుళ్ల క్రాస్ రోడ్స్ వద్ద ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జరిగిన మూడు రోజులకే మరో గంజాయి ముఠా పట్టుబడటం కలకలం రేపుతోంది. 


Also Read: Danam Nagender Dance: గులాబీ దళాల సంబురం.. ఎమ్మెల్యే దానం 'తీన్మార్' డ్యాన్స్!


Also Read: Cruid Oil Price: రష్యా ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం, మరింతగా పెరగనున్న పెట్రోల్ ధర


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook