Danam Nagender Dance: గులాబీ దళాల సంబురం.. ఎమ్మెల్యే దానం 'తీన్మార్' డ్యాన్స్!

Danam Nagender Dance: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు అసెంబ్లీ వేదికగా చేసిన ఉద్యోగాల ప్రకటనపై రాష్ట్ర యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహిస్తున్న సంబరాల్లో ఖైరతబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. అందులో భాగంగా పార్టీ అభిమానులతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 9, 2022, 02:17 PM IST
Danam Nagender Dance: గులాబీ దళాల సంబురం.. ఎమ్మెల్యే దానం 'తీన్మార్' డ్యాన్స్!

Danam Nagender Dance: తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర మొదలైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ బుధవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 91,142 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అందులో 80,039 ఉద్యోగాలను ఈరోజే నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. 

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొందరు యువకులు కేసీఆర్ ఫొటోకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ భవన్ ఎదుట జరిగిన టీఆర్ఎస్ శ్రేణుల సంబురాల్లో అధికార ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. కార్యకర్తలతో పాటు సరదాగా డ్యాన్స్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. 

ఎమ్మెల్యే దానం నాగేందర్ డ్యాన్స్

సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇందులో పాల్గొని సరదాగా డ్యాన్స్ చేశారు. తీన్మార్ డప్పులకు పార్టీ అభిమానులతో పాటు కలిసి స్టెప్పులేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Also Read: Telangana Jobs Notifications: తెలంగాణ నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ భారీ బొనాంజ.. 91 వేల పోస్టులకు నోటిఫికేషన్!!

ALso Read: Telangana Job Notification: ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News