Sajjanar Warning: సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే అల్లు అర్జున్ తొలిసారిగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అతడు నటించిన ఓ యాడ్ షూట్ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం ఆగ్రహానికి కారణమైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు(Allu Arjun) తెలంగాణ ఆర్టీసీ ఎండీ అల్లు అర్జున్ వార్నింగ్ ఇచ్చారు. లీగల్ నోటీసులు పంపించారు. ఆశ్చర్యంగా ఉందా. నిజమే మరి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటూ అందరితో సరదాగా ఉండే అల్లు అర్జున్ కొత్తగా వివాదంలో చిక్కుకున్నారు. అతడు నటించిన రాపిడో యాడ్ ఈ వివాదానికి కారణంగా మారింది. 


హీరో అల్లు అర్జున్ ఇటీవల ర్యాపిడో సంస్థ(Rapido) తరపున యాడ్ షూట్ చేశాడు. ఇందులో తెలంగాణ ఆర్టీసీ బస్సును దోషతో పోల్చి చూపారు. దీంతో ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ తో పాటు ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపించారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను కించపరిచే యాడ్‌ను వెంటనే నిలిపివేయాలన్నారు. ఆర్టీసీని ఎవరు తక్కువ చేసి మాట్లాడినా క్షమించమన్నారు. అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థలు స్పందించకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు. లీగల్ నోటీసులకు అల్లు అర్జున్ ఏం స్పందిస్తారో చూడాలి. సజ్జనార్(V C Sajjanar)ఆర్టీసీ ఎండీగా బాథ్యతలు తీసుకున్నప్పటి నుంచి వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆర్టీసీ అభివృద్ధికి, ప్రయాణీకుల సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 


Also read: Naga shourya Father: మంచిరేవుల పేకాట కేసులో.. హీరో నాగశౌర్య తండ్రి అరెస్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook