Telangana Rythu Bandhu: రాష్ట్ర రైతులకు ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం.. రైతు బంధు పథకం ఏనిమిదవ విడత అమలు మూడో రోజుకు చేరింది. యాసంగి సీజన్​కు సంబంధించి ఈ సాయం చేస్తోంది (Rythu Bandhu Scheme 2021) ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు రోజుల్లో రూ.1,302.6 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 45,95,167 మంది రైతుల ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమ చేసినట్లు వెల్లడించింది.
ఎప్పటిలానే ఆరోహన క్రమంలో.. అంటే తక్కువ భూమి ఉన్న వారి ఖాతాల్లో మొదటగా డబ్బు జమ చేస్తున్నట్లు వెల్లడించింది (Rythu Bandhu latest news) ప్రభుత్వం.


కేసీఆర్ లక్ష్యం అదే..


సమైక్య పాలనలో వ్యవసాయానికి దూరమైన రైతులను తిరిగి వ్యవసాయ రంగంలో నిమగ్నం చేయడమే కేసీఆర్​ లక్ష్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే.. రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. దీనితో పెద్ద ఎత్తున రైతులు సాగుపై దృష్టి సారించారని వివరించారు.


ఫలితంగా తెలంగాణలో ఊహించని విధంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెరిగిందని చెప్పుకొచ్చారు వ్యవసాయ మంత్రి.


యాసంగి సీజన్​లో 66.61 లక్షల రైతులను రైతుబంధుకు అర్హులుగా తేల్చినట్లు చెప్పారు మంత్రి నిరంజన్​ రెడ్డి. మొత్తం 152.91 లక్షల ఎకరాల భూమికి సంబంధించి రైతు బంధు సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.7,645 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్లు వివరించారు.


Also read: Rajendrangar Rape Incident: రాజేంద్రనగర్‌లో పదో తరగతి బాలికపై యువకుడి రేప్


Also read: Karate Kalyani Latest News: హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ కరాటే కల్యాణి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook