Drunken Invigilator Suspended: తెలంగాణవ్యాప్తంగా రెండు రోజుల క్రితం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కఠిన నిబంధనల నడుమ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ పరీక్షా కేంద్రానికి ఓ ఇన్విజిలేటర్ ఏకంగా తాగొచ్చాడు. పీకలదాకా మద్యం సేవించి పరీక్షా హాలుకి వచ్చాడు. జిల్లా విద్యాధికారి అతన్ని సస్పెండ్ చేశారు. హుజురాబాద్‌లోని రాంపూర్ జడ్పీ హైస్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళ్తే... రాంపూర్ జడ్పీ హైస్కూల్లో పీఈటీగా విధులు నిర్వర్తిస్తున్న ఆముల రవి కుమార్ పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా జడ్పీ స్కూల్లోని ఓ క్లాస్ రూమ్‌లో ఇన్విజిలేటర్‌గా వ్యవహరిస్తున్న సమయంలో విద్యార్థులకు అతనిపై అనుమానం కలిగింది. అతని ప్రవర్తన తేడాగా ఉండటంతో తాగొచ్చాడేమోనని విద్యార్థులు భావించారు.


ఆ తర్వాత కాసేపటికే జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు స్కూల్లో తనిఖీలకు వచ్చారు. రవి కుమార్‌పై అనుమానంతో అతన్ని పిలిచి మాట్లాడారు. రవి కుమార్ నోటి నుంచి గుప్పుమని మద్యం వాసన రావడంతో వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు స్కూల్‌ వద్దకు చేరుకుని రవి కుమార్‌కు బ్రీత్ అనలైజర్‌తో టెస్టులు చేశారు. ఈ టెస్టుల్లో మద్యం లెవల్ 112గా చూపించింది. దీంతో విద్యాధికారి జనార్ధన్ రావు వెంటనే రవి కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారి పట్ల కఠిన చర్యలు తప్పవని జనార్ధన్ రావు పేర్కొన్నారు. టీచర్ రవి కుమార్‌తో పాటు ఆ పరీక్షా కేంద్రంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సూపరిండెంట్‌ను కూడా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. 


Also Read: Video: ఈ చిన్నారి సంకల్పానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒంటికాలితో గెంతుతూ స్కూల్‌కు...   


Also Read: Vishwaroop Comments: కోనసీమ అల్లర్ల వెనుక ఆ పార్టీల హస్తం..మంత్రి విశ్వరూప్‌ హాట్ కామెంట్స్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి