Sabitha on Schools: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు యధావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. స్కూళ్లల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. రేపటి నుంచే ఇంగ్లీష్‌ మీడియం ప్రారంభంకానుందని స్పష్టం చేశారు. దీనిపై బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిందేమి లేదని విమర్శించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రం నుంచి రాష్ట్రానికి సరైన సహకారం లేదన్నారు మంత్రి. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి కసరత్తు జరుగుతోందని వెల్లడించారు. కరోనా వల్ల రెండేళ్లుగా విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని చెప్పారు. ఐనా విద్యకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ పాఠాలు అందరికీ అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. టెట్‌ ఎగ్జామ్ నిర్వాహణ అద్భుతంగా ఉందన్నారు.


స్కూళ్లలకు వచ్చే పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. ఒకటి నుంచి 8 తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం ఈఏడాది నుంచి ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి. అజీమ్ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆంగ్ల బోధన ఉంటుందని తెలిపారు. మొదటి నెల బ్రిడ్జ్‌ క్లాసెస్‌లాగా నిర్వహించాలని టీచర్లకు చెప్పామని..యధావిధిగా పుస్తకాలు, యూనిఫామ్‌ అందిస్తామన్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. టాయిలెట్స్, శానిటేషన్‌, డ్రింకింగ్ వాటర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. అన్ని పాఠశాలల్లో మిషన్‌ భగీరథ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


Also read: Ukraine Cholera: ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితులు..కొత్త తలనొప్పితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు..!


Also read: Southwest Monsoon: తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాల రాకకు వేళాయే..ఇక భారీ వర్షాలే..!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి