Telangana: రాష్ట్రంలో తొలి కేజీ టు పీజీ విద్యాలయం సిద్ధం, ఆధునిక వసతులతో త్వరలో ప్రారంభం
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ హయాంలో తొలి కేజీ నుంచి పీజీ విద్యాలయం ప్రారంభం కానుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Telangana: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ హయాంలో తొలి కేజీ నుంచి పీజీ విద్యాలయం ప్రారంభం కానుంది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ కార్యరూపం దాలుస్తోంది. కేజీ నుంచి పీజీ వరకూ ఉచితమైన నిర్బంధ విద్య అందిస్తామనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ. ఎందుకంటే రెసిడెన్షియల్ పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలతో ఉచిత విద్య లక్ష్యం నెరవేరదని..కేసీఆర్ ఉద్యమ సమయంలో చాలాసార్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కేజీ నుంచి పీజీ వరకూ పూర్తిగా ఉచిత విద్యను అందించే ప్రాంగణాలు సిద్ధం చేస్తామన్నారు.
ఆ తొలి భవనం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఇది తొలి కేజీ నుంచి పీజీ విద్యాలయం. కేజీలో చేరే పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ కావల్సిన విభాగాన్ని ఎంచుకుని పూర్తిగా చదువుకుని బయటకు వచ్చేలా ప్లాన్ చేశారు. ఇది పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యాన నడుస్తుంది.
ఫోటోలు చూస్తుంటే అత్యంత ఆధునికంగా, పూర్తి స్థాయి వసతులతో ఉన్నట్టుంది. స్పోర్ట్స్ కోసం ట్రాక్, విశాలమైన ఆడిటోరియం, అధునాతన క్లాస్‌రూమ్స్ ఇలా అన్నింటా హైటెక్ హంగులు కన్పిస్తున్నాయి.
Also read: TS EAMCET 2022: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు రేపే విడుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook