Telangana:తెలంగాణలో నేటితో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అవనుంది. పార్టీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్‌లో ఇవాళ చేరనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. దాదాపుగా పార్టీ మొత్తం ఖాళీ అయిందనే చెప్పవచ్చు. పార్టీలో ఉన్న ఏకైన సీనియర్ నేత, పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ కూడా ఇటీవల పార్టీకు రాజీనామా చేశారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని అందుకోనున్నారు. ఈ నెల 16 న హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు.రమణతో పాటు మరికొందరు టీడీపీ స్థానిక నేతలు టీఆర్ఎస్‌(TRS)లో చేరనున్నారు. జూలై 9వ తేదీన తెలుగుదేశం పార్టీకు రాజీనామా చేసిన లేఖను ఎల్ రమణ (L Ramana)విడుదల చేశారు. అనంతరం చంద్రబాబుకు లేఖను పంపించారు. తన ఎదుగుదలకు 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు(Chandrababu)..ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో టీఆర్ఎస్‌లో చేరుతున్నానని వెల్లడించారు. 


Also read: L Ramana Resigns to TDP: తెలంగాణలో టీడీపీకి భారీ షాక్, అధ్యక్ష పదవికి రమణ రాజీనామా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook