Greenfield Airports: తెలంగాణలో త్వరలో ఆరు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ ప్రక్రియను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పూర్తి చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో మరో ఆరు ఎయిర్‌పోర్ట్‌లు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలకు సంబంధించిన ఫీజిబిలిటీ స్డడీ(Feasability Study) పూర్తయినట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆ నివేదికను తెలంగాణ (Telangana)ప్రభుత్వానికి అందించినట్టు టీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. 


రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఆరు గ్రీన్‌ఫీల్డ్ విమాశ్రయాల్ని(Greenfield Airports)ప్రతిపాదించింది. ఇందులో నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని మూడు బ్రౌన్‌‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, అదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఇప్పటికే ఫీజిబిలిటీ స్టడీ పూర్తయింది. ఇక ఈ విమానాశ్రయాల నిర్మాణమనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని మంత్రి జనరల్ వీకే సింగ్ చెప్పారు. మరోవైపు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(Rajivgandhi international Airport) విస్తరణ 2022 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని చెప్పారు. విస్తరణ పూర్తయిన తరువాత ప్రయాణీకుల సామర్ధ్యం ఏడాదికి 1.2 కోట్ల నుంచి 3.4 కోట్లకు పెరగనుంది. 


తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచిన గిరిజన వర్శిటీకి భూ కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) జాప్యం చేసిందని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయమంత్రి బిశ్వశ్వర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లాలో ఈ వర్శిటీ ఏర్పాటుకు డీపీఆర్ పూర్తయిందని..ఆర్ధిక అనుమతులు రావల్సి ఉందన్నారు. ఇక తెలంగాణ నుంచి స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల్లో ఎంపికైన గ్రేటర్ వరంగర్, కరీంనగర్‌లలో ఇప్పటి వరకూ 752 కోట్ల విలువైన పనులు చేసినట్టు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. 


Also read: Omicron: దక్షిణాఫ్రికా నుంచి 185 మంది ప్రయాణికులు.. 11 మందికి పాజిటివ్! భయాందోళనలో హైదరాబాద్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook