Telangana Rains Alert: తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
Telangana Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన రుతు పవన ద్రోణి కారణంగా తెలంగాణలో రానున్నమూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుందో వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఉత్తర బంగాళాఖాతంవైపుకు కొనసాగుతోంది. ఇది క్రమంగాబలపడి ఉత్తర దిశగా కదలనుంది. ఈ నెల 9వ తేదీన ఒడిశా-బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారనుంది. ఫలితంగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు తప్పినా వర్ష సూచన మాత్రం వీడలేదు. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉన్న ఆవర్తనం ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని తెలుస్తోంది. రుతు పవన ద్రోణి ఇవాళ సముద్రమట్టంపై ఉత్తర బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా ఇవాళ రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడనున్నాయి.
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడినా ఎల్లుండి మాత్రం భారీ వర్షాలు పడవచ్చు. ఇవాళ, రేపు , ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి.
Also read: Submerged Bikes & Cars: విజయవాడలో వాహన మెకానిక్‌లకు భారీ డిమాండ్, ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద క్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.