Telangna 10th Class Exam Schedule Released: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక, తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది అంటే 2023 ఏప్రిల్ 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇక విద్యార్థులు పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యేలా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పదవ తరగతి లో 6 పేపర్ లతోనే పరీక్షలు జరగనున్నాయి, గతంలో 11 పేపర్లతో జరిగే పదో తరగతి పరీక్షలను కరోనా నేపథ్యంలో ప్రభుత్వం కుదించింది. ఇప్పుడు కూడా అదే ఆరు పేపర్లతో పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇక కేవలం పదో తరగతి పరీక్షలు మాత్రమే కాదు 9వ తరగతికి కూడా 6 పేపర్ లే ఉండనున్నాయి. ఇక పరీక్ష సమయం 3 గంటలుగా ఉండనుంది. అయితే సైన్స్ పేపర్ కు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. ఇక 80 మార్కులకు పరీక్ష జరగనుండగా 20 మార్కులు ఫార్మేటివ్ అసెస్మెంట్ కి ఇవ్వనున్నారు.


ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు జరగనుంగ ఆరు పేపర్లతోనే పదో తరగతి బోర్డు పరీక్షలు జరగనున్నాయి. వంద శాతం సిలబస్ తో పరీక్షలు జరగనున్న క్రమంలో ప్రిపేర్ అయ్యేలా స్పెషల్ క్లాసులు నిర్వహిస్తామని చెబుతున్నారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్నలకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండదని చెబుతున్నారు.


ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలు జరగనున్నాయి. నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు, ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని కూడా సూచనలు ఇంద్రారెడ్డి చేశారు. 
Also Read: Heeraben Modi Health: హీరాబెన్‌ మోడీ హెల్త్‌ బులిటెన్‌ విడుదల.. ఆస్పత్రికి మోడీ


Also Read: రాబోయే 40 రోజులే అత్యంత కీలకం.. కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర వర్గాల సమాచారం ఇదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook