మహాకూటమిలో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశం తేలిపోయింది. మొత్తం 119 స్థానాలకు గాను భాగస్వామ్య పక్షాలకు 26 స్థానాలు కాంగ్రెస్ కేటాయించింది. టీడీపీకి 14, టీజేఎస్ కు 8, సీపీఐకి 3 స్థానాలు, తెలంగాణ ఇంటి పార్టీకి ఒక్క సీటును కేటాయించారు. ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం భాగస్యామ్య పక్షాలకు కేటాయించిన స్థానాలను పార్టీల వారీగా ఒక్కసారి పరిశీలిద్దాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజేఎస్ కు కేటాయించిన స్థానాలు: 


* జనగామ


* మల్కాజ్ గిరి 


* మెదక్


* మహాబూబ్ నగర్


* సిద్దిపేట 


* దుబ్బాక 


*రామగుండం


* వర్థన్నపేట


సీపీఐకి కేటాయించిన స్థానాలు:
*వైరా
*బెల్లంపల్లి
* హుస్నాబాద్ 
అయితే తమకు కనీసం నాలుగు సీట్లైనా కేటాయించాలని సీపీఐ పట్టుబడుతోంది. చివరి నిమిషంలో మార్పు చేర్పులు చేసి మరో స్థానం కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.


అభ్యర్ధుల విషయంపై టీడీపీ కసరత్తు
టీడీపీకి కేటాయించిన స్థానాలు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే టీడీపీకి కేటాయించిన 14 స్థానాల్లో ఏడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నట్లు సమాచారం. అయితే ఏఏ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది...ఆయా స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే విషయం రేపు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అధికారికంగా ప్రకటించనున్నారు