Dalit Conclave in Hyderabad: త్వరలో హైదరాబాద్‌లో దళిత కాన్క్లేవ్
ThirumaValavan Meets KCR: టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ పార్టీ పేరిట జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన సందర్భంగా గురువారం ప్రగతిభవన్‌లో తమిళనాడు ఎంపీ, ప్రముఖ దళిత నేత, వీసీకే పార్టీ అగ్ర నేత అయిన తిరుమావళవన్‌తో పాటు పలు రాష్ట్రాల నాయకులు సీఎం కేసీఆర్‌ను కలిశారు.
ThirumaValavan Meets KCR: తిరుమావళవన్‌తో పాటు పలు రాష్ట్రాల నాయకులతో భేటీ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల సామాజికవర్గం అభివృద్ది కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాల అమలు తీరును స్పూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ డిమాండ్ చేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వున్న దళిత సోదరులతో దళిత్ కాంక్లేవ్ నిర్వహించి దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని బహిర్గతం చేస్తామని కేసీఆర్ స్పష్టంచేశారు.
కేసీఆర్‌తో భేటీ అనంతరం తమిళనాడు ఎంపీ తిరుమావళవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో దళితుల కోసం తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాల గురించి తెలుసుకున్నానని, దళితుల కోసం ఇన్ని పథకాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని చెబుతూ కేసీఆర్‌ని ప్రశంసించారు. తెలంగాణ సర్కారు అమలు చేస్తోన్న దళిత బంధు పథకం గొప్ప పథకమని కేసీఆర్‌ని అభినందించారు.
ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ని కలిసిన నేతల్లో వివిధ రాష్ట్రాల రైతు నాయకులు రాకేశ్ రఫీక్, అక్షయ్ (ఒడిషా), మహారాష్ట్ర రైతు నాయకుడు దశరథ్ సావంత్, హర్యానాకు చెందిన సంయుక్త కిసాన్ మోర్చా నాయకుడు గుర్నామ్ సింగ్, ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్టు వినీత్ నారాయణ తదితరులు ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ పాత్రపైనే (BRS Party News) వీరి చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
Also Read : TRS to BRS: బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు, జండా మారుతాయా ?
Also Read : HD Kumaraswamy on BRS: కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుపై కుమార స్వామి కీలక వ్యాఖ్యలు
Also Read : KCR's TRS to BRS: కేసిఆర్ బీఆర్ఎస్ స్థాపించడం వెనుకున్న కుట్ర అదేనన్న ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి