HD Kumaraswamy on BRS: కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుపై కుమార స్వామి కీలక వ్యాఖ్యలు

BRS Gets HD Kumaraswamy's Support: టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని జేడీఎస్ పార్టీ అధినేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అభినందించారు.

Written by - Pavan | Last Updated : Oct 5, 2022, 10:29 PM IST
  • టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన కేసీఆర్
  • సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఆకాశానికెత్తిన కుమారస్వామి
  • జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌కి మద్దతుపై కుమార స్వామి కీలక వ్యాఖ్యలు
HD Kumaraswamy on BRS: కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీకి మద్దతుపై కుమార స్వామి కీలక వ్యాఖ్యలు

BRS Gets HD Kumaraswamy's Support: దేశ రాజకీయాల్లో నేడు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు చర్చనియాంశమయ్యాయి. గతంలో పలు సందర్భాల్లో కేసీఆర్ బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత దేవేగౌడను, కుమారస్వామిని కలిసొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కుమార స్వామి సైతం గతంలో హైదరాబాద్ వచ్చి ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఆతిథ్యం స్వీకరించి వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. ఈ విధమైన బంధం మధ్యే ఇవాళ కుమార స్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌కి మద్దతు పలికారు. 

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. దళిత సామాజికవర్గంపై రైతులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ఉన్న కమిట్‌మెంట్ గొప్పదని కుమార స్వామి కితాబిచ్చారు. కేసిఆర్ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతో తెలంగాణలో విజయం సాధించడం ఒక గొప్ప విషయం. తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన మీరు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి రావడం సంతోషించదగిన విషయం అని అన్నారు. తెలంగాణ ప్రజలు సంతోష పరిచినట్టే.. జాతీయ రాజకీయాల్లోనూ మీరు విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న మీ కలలను నిజం చేసుకున్నారు. తెలంగాణలో అభివృద్ధిని కోరుకున్నట్టే.. ఇప్పుడు మీరు దేశాభివృద్దిని సవాలుగా తీసుకున్నారు. మీ హృదయాంతరాల్లోంచి వచ్చిన మీ ప్రసంగంలో పేదలు, బడుగు బలహీన వర్గాల పట్ల మీకున్న నిబద్దత అర్థమైంది. తెలంగాణలో దళితులు, రైతుల అభివృద్దిని సాధించారు. కేవలం జాతీయ ప్రయోజనాల కోసమే, దేశ భవిష్యత్ నిర్మాణం కోసమే కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా విస్తరించాలని కోరుకుంటున్నారు అంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడంపై కేసీఆర్ ఆలోచనలను కుమారస్వామి పంచుకున్నారు. 

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ నిర్మాణానికి అవసరమైన విజనరీ ఉన్న నాయకుడు. ఛాలెంజింగ్ లీడర్.. లెజెండరీ లీడర్ అంటూ కీర్తించారు. తెలంగాణలో విజయం సాధించిన మీరు జాతీయ రాజకీయాల్లోనూ ఎదగాలని కోరుకుంటూ మీకు మద్దతుగా ఇక్కడికి వచ్చామని.. జాతీయ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితికి జేడీఎస్ మద్దతు ఉంటుందని కుమార స్వామి బహిరంగంగానే ప్రకటించారు. కేంద్రం గత ఏడేళ్లుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అందుకే కేంద్రానికి గట్టి సమాధానం చెప్పడానికే కేసిఆర్ దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారని కుమార స్వామి చెప్పుకొచ్చారు. 

Trending News