Kadiyam Srihari: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చేరిన మరుసటి రోజే వరంగల్‌ లోక్‌సభ సీటును తన కుమార్తె కావ్యను ఇప్పించుకున్నారు. ఇక కుమార్తె గెలుపు కోసం కడియం శ్రీహరి ప్రజల మధ్యలోకి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన ఓ సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. 'బీఆర్‌ఎస్‌ను వీడడం బాధగా ఉంది. నా పార్టీ నాకు చాలా అవకాశాలు ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్‌పై గౌరవం ఉంది' అని తెలిపారు. కేసీఆర్‌పై విమర్శలు చేయదల్చుకోలేదని ప్రకటించారు. 'ఇది నా చివరి ఎన్నిక కావచ్చు' అని సంచలన ప్రకటన చేశారు. నీతి నిజాయితీగా రాజకీయం చేసినట్లు చెప్పారు. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Warangal MP Ticket: బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య.. సిట్టింగ్‌ ఎంపీకి భారీ షాక్‌


కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై స్పందిస్తూ.. 'పీసీసీ పెద్దల ఆహ్వానం వల్లే కాంగ్రెసులో చేరాను. కాంగ్రెస్‌ పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఆశీర్వదించాలి' అని కోరారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. మోదీ ప్రభుత్వం పదేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేస్తోందని విమర్శించారు. సీబీఐ, ఈడీ కేసుల ద్వారా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలను దొడ్డిదారిన కూలగొట్టిన చరిత్ర మోదీది అని తెలిపారు. దేశంలో ప్రతిపక్షాలు నామరూపాలు లేకుండా చేసేలా మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం


ప్రతిపక్షంలో ఉన్న నిందితుడు బీజేపీలో చేరగానే కేసులన్ని వాయిదా వేస్తున్నారని కడియం శ్రీహరి తెలిపారు. దేశంలో ముస్లిం మైనారిటీలకు రక్షణ లేదన్నారు. మణిపూర్ అల్లర్లు భారతదేశానికి మాయని మచ్చ అని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌ పార్టీకే ఉందని ప్రకటించారు. బీజేపీ ఆగడాలను అడ్డుకోవడానికి కాంగ్రెసులో చేరినట్లు వివరించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. నేను పార్టీ మారగానే నాపై జిల్లా నాయకులు కూడా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు.


తాను అవకాశవాదిని కాదని కడియం శ్రీహరి చెప్పుకున్నారు. అవకాశాలే తన వద్దకు వచ్చాయని పేర్కొన్నారు. తాను దిగజారి మాట్లాడలేనని తెలిపారు. తనపై విమర్శలు చేస్తున్న ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై శ్రీహరి విరుచుకుపడ్డారు.'నేను లేకుండా మంద కృష్ణ మాదిగ లేరు. ఆర్థికంగా కూడా ఆనయకు నేను సహకారం అందించా. బీజేపీకి ఓటు వేయమంటున్న మంద కృష్ణ మాదిగ దండోరా ముసుగు తీసేసి బీజేపీ నాయకుడిగా పని చేయాలి' అని హితవు పలికారు. అతడి వలనే మాదిగ ఉద్యమం, ఎమ్మార్పీఎస్‌ బలహీనపడిందని విమర్శించారు. తాను చేరడం వలన కాంగ్రెస్‌ పార్టీ అసంతృప్తి, అసహనం ఉండడం సహజం అని చెప్పారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై, బీఆర్ఎస్‌ పార్టీ నాయకులపై విమర్శలు చేశారు. 'నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా నన్ను విమర్శలు చేస్తున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడవలేక బయటకు వచ్చినట్లు వివరించారు. కాగా ఈ సమావేశంలో ఆయన కుమార్తె, వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య తదితరులు ఉన్నారు. వరంగల్‌లో తన కుమార్తె గెలుపు కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కడియం శ్రీహరి కలుస్తూ మద్దతు కోరుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook