Warangal MP Ticket: బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య.. సిట్టింగ్‌ ఎంపీకి భారీ షాక్‌

Congress Anounced Warangal Candidate To Kadiyam Kavya: రాజకీయాలు ఎలా ఉంటాయో కడియం శ్రీహరి చేసిన ఎత్తుగడే ఉదాహరణగా నిలుస్తోంది. అధికార పార్టీలో పదవి కోసం అడ్డగోలు ఆరోపణలు చేసి ఇప్పుడు కూతురుకు పార్టీ టికెట్‌ నెగ్గించుకున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 1, 2024, 10:49 PM IST
Warangal MP Ticket: బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కడియం కావ్య.. సిట్టింగ్‌ ఎంపీకి భారీ షాక్‌

Kadiyam Kavya: అనూహ్యంగా అధికార పార్టీలోకి జంప్‌ చేసిన కడియం కావ్యకు మళ్లీ వరంగల్‌ ఎంపీ టికెట్‌ లభించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి లభించినా టికెట్‌ నిరాకరించి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం కావ్య మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కావ్య అభ్యర్థిత్వంపై కీలక ప్రకటన చేసింది. దీంతో వరంగల్‌ పార్లమెంట్‌ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌కు భారీ షాక్‌ తగిలింది. ఇటీవల ఆయన కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మళ్లీ అవకాశం దక్కుతుందేమో అనుకుంటే కావ్యకు దక్కడంతో దయాకర్‌ నిరాశకు గురయ్యారు.

Also Read: Harish Rao: రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలో రేపో ఎప్పుడూ కూలుతుందో..? హరీశ్ రావు సందేహం

వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. దీనితో కలిపి రాష్ట్రంలోని 17 స్థానాల్లో 14 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన హైదరాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ స్థానాలపై అధిష్టానం కసరత్తు చేస్తోంది.

Also Read: KTR Vs Kishan Reddy: గాలికి గెలిచిన కిషన్‌ రెడ్డికి ఈసారి ఓటమే.. ఇదే నా ఛాలెంజ్‌: కేటీఆర్‌

తండ్రికూతురు నీచపు రాజకీయం
స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కీలక రాజకీయ ఎత్తుగడ వేశారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఉన్న సమయంలో వెన్నుదన్నుగా నిలిచిన కడియం శ్రీహరి అనూహ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో ఆయన తన రాజకీయ స్వార్థం చూసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అయితే గులాబీ పార్టీ నుంచి తన కుమార్తె కావ్యకు టికెట్‌ ఇప్పించుకున్న వారం రోజుల తర్వాత వ్యూహాత్మకంగా ఆ పార్టీని వీడారు. టికెట్‌ నిరాకరించిన కావ్య తండ్రితోపాటు హస్తం పార్టీలో చేరి ఇప్పుడు టికెట్‌ పొందారు. అయితే రాజకీయంగా వేసిన ఎత్తుగడలు కడియం కుటుంబంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రేవంత్ రెడ్డి వర్గానికి పెద్దపీట
టికెట్ల కేటాయింపుపై రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు పార్టీ అధిష్టానంతో కలిసి చర్చలు జరుపుతున్నారు. తన వర్గానికి అత్యధిక సీట్లు దక్కేలా రేవంత్‌ రెడ్డి వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో మెజార్టీ రేవంత్‌ రెడ్డి వర్గానికి చెందినవారు ఉండడం గమనార్హం. ఖమ్మం సీటుకు అత్యధిక పోటీ ఉండడంతో రేవంత్‌ రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనేది ఆసక్తికరంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News