మహాకూటమి నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ టీజేఎస్ పార్టీ 12 స్థానాలో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం  తెలిసిందే. టీజేఎస్ ప్రకటించిన మూడు స్థానాల్లో  ఆసిఫాబాద్ , మహబూబాబాద్ , స్టేషన్ ఘన్ పూర్ స్థానాలు ఉండటం గమనార్హం.  ఇప్పటికే ఆ స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ తమ ఉమ్మడి అభ్యర్ధులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న టీజేఎస్ పార్టీ కూడా బరిలోకి దిగుతామని ప్రకటించడం చర్చనీయ అంశంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహాకూటమిలో పెద్దన్నపాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ .. టీజేఎస్ కు 9 సీట్లు మాత్రమే కేటాయించింది.  టీజేఎస్ మాత్రం ఎప్పటి నుంచో తమకు 12  సీట్లకు తగ్గకుండా కావాలని పట్టుబడుతోంది. టీజేఎస్ ప్రతిపాదన బేఖాతరు చేస్తూ 9 సీట్లు మాత్రమే కేటాయించింది కాంగ్రెస్ . ఈ క్రమంలో హస్తం పార్టీ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్న టీజేఎస్ సరిగ్గా నామినేషన్ల సమాయానికి పోటీ చేసే స్థానాలను ప్రకటించి కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చింది.


పోటీ చేసే స్థానాల విషయంలో టీజేఎస్ ప్రకటన వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు నామిషనేషన్లు ప్రక్రియ కొనసాగుతుండటం..మరోవైపు మూడో జాబితాపై కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ను ఒత్తిడిలో పడేసి..తాము కోరుకుంటన్న సీట్లు సాధించుకోవాలనే టీజేఎస్ ఈ మేరకు ప్రకటన చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టీజేఎస్ వేచిన స్కెచ్ పై కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు స్పందిస్తున్నందనేది మూడో జాబితా విడుదలతో తేలిపోతుంది. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఉత్కంఠత నెలకొంది.