హైదరాబాద్‌లో విషాదం.. గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులు నిద్రలోనే కన్నుమూసిన విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఫ్యామిలీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్: నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. గోడ కూలిన ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. నిద్రిస్తున్న చిన్నారుల ప్రాణాలు తెల్లవారక ముందే గాల్లో కలిసిపోయాయంటూ కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. హబీబ్ నగర్ పరిధిలోని అఫ్జల్ సాగర్ రోడ్డు మాన్‌గిరి బస్తీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
Also Read: వామ్మో .. మార్చిలో బ్యాంకులకు అన్ని సెలవు దినాలా?
మాన్‌గిరి బస్తీలో ఓ ఇంటి గోడ కూలి నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులపై పడింది. దీంతో శిథిలా కింద చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన చిన్నారులు రోషిణి(6), సారిక(3)తో పాటు నాలుగు నెలల చిన్నారి పావని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ దర్యాప్తు చేపట్టారు.
See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి