HEAVY RAINS:తెలంగాణలో నాలుగు రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించారు సీఎం కేసీఆర్. సోమ, మంగళ, బుధ వారాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలు కురస్తున్నందున ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో  తెలంగాణలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.  పలు జిల్లాలో కుంభవృష్టి కురిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్  జిల్లాలో క్లౌడ్ బరస్ట్ అయిందా అన్నట్లుగా నాన్ స్టాప్ గా కుండపోత వాన కురిసింది. కొన్ని ప్రాంతాల్లో  కేవలం  ఐదారు గంటల్లోనే 250 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.భూపాలపల్లి జిల్లా ముత్తారం మహదేవ్ పూర్ లో గత 24 గంటల్లోనే ఏకంగా 35 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం కూడా భూపాలపల్లి జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకే ముత్తారం మహదేవ్ పూర్ లో 167 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వానలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని దాదాపు అన్ని చెరువులు నిండిపోయాయి. పలు గ్రామాలు జలమలమయ్యాయి. సాగునీటి ప్రాజెక్టులు నిండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎప్పుడు లేనట్లుగా జూలై రెండో వారంలోనే శ్రీరాంసాగర్ నిండిపోయింది. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 


తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఏడు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణాలో వర్షపాతం ఇలానే నమోదు అయితే రానున్న 24 గంటల్లో పలు జిల్లాలో వరదలు సంభంవించే అవకాశం ఉందని తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి , రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జిల్లాల్లో వరద ప్రమాదం ఉంటుందని అంచనా వేసింది భారత వాతావరణ కేంద్రం. దీంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటించింది తెలంగాణ సర్కార్. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలోనే ఉంది పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 


Read also: Kodali Nani: చంద్రబాబుకు ఇక రాజకీయ సమాధే..టీడీపీపై కొడాలి నాని హాట్ కామెంట్స్..!


Read also: KCR VS ETELA RAJENDER:గజ్వేల్ లో కేసీఆర్ పై ఈటల రాజేందర్ పోటీ.. బెంగాల్ సీన్ రిపీటయ్యేనా?  


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook