హైదరాబాద్: టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమికి ఒక రూపం రాకముందే సీట్ల కోసం కొట్లాటా మొదలైంది.  ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రాలేదు. దీంతో తెలంగాణ జన సమితి మహాకటమికి 48 గంటల డెడ్ లైన్ విధించినట్లు సమాచారం. ప్రముఖ మీడియా కథనం ప్రకారం రెండు రోజుల్లో తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే.. తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీజేఎస్  భారీ మొత్తంలో సీట్లు అడగడంతో దీనికి కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. టీజేఎస్ కు 4 నుంచి 5 సీట్లు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. దీనికి సరేమిరా అంటున్న కోదండరాం... కూటమిలో సీట్ల సర్దుబాటు కాకుంటే తమతో కలిసొచ్చే శక్తులతో ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయలేదు


కేసీఆర్ ను గద్దె దించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ ను ఒకే వేదికపై వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి లక్ష్యంతో ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయం తీసుకున్నాయి. సీట్ల సర్దుబాటు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ కు అప్పగించారు. ఈ క్రమంలో కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్  సీట్ల సర్దుబాటు అంశం ఇంకా  తేల్చలేదు. ఎన్నికలు దగ్గరపడుతున్నప్పటికీ అభ్యర్ధులపై ఇంకా నిర్ణయం తీసుకోనందున కోదండరాం ఈ మేరకు డెడ్ లైన్ విధించినట్లు తెలిసింది.