Auto-Cab Strike: జంట నగరాల్లో నిలిచిపోయిన ఆటో, క్యాబ్‌లు, ప్రజల ఇబ్బందులు
Auto-Cab Strike: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్ లు నిలిచిపోయాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ ఒక్కరోజు బంద్ చేపట్టాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Auto-Cab Strike: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఆటోలు, క్యాబ్ లు నిలిచిపోయాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో ఇవాళ ఒక్కరోజు బంద్ చేపట్టాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ 2019 పేరుతో విధిస్తున్న జరిమానాలకు వ్యతిరేకంగా జంట నగరాల్లో ఒకరోజు బంద్‌కు డ్రైవర్స్ యూనియన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ జంట నగరాల్లో ఆటోలు, క్యాబ్‌లు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి నుంచి ఎక్కడికక్కడ ఆటోలు, క్యాబ్‌లు, లారీలు ఆగిపోయాయి. ఈ చట్టం పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్ల నుంచి దోపిడీ జరుగుతోందనేది డ్రైవర్ల యూనియర్ ఆరోపణ. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డ్రైవర్ల యూనియన్ జేఏసీ డిమాండ్ చేస్తోంది.
మరోవైపు ఫిట్‌నెస్ లేట్ ఫీజు పేరుతో రోజుకు 50 రూపాయలు వసూలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ట్రాన్స్‌పోర్ట్ భవన్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇప్పటికే పెరిగిన ఇంధన ధరలతో నష్టపోతున్నామని..ఇప్పుడు జరిమానాలతో అదనపు భారం సమంజసం కాదని డ్రైవర్లు చెబుతున్నారు. ఇవాళ జరగనున్న భారీ ర్యాలీలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఐఎఫ్, క్యాబ్, ఆటో, లారీ సంఘాలన్నీ సంయుక్తంగా పాల్గొంటున్నాయి.
ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్ కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నిన్న రాత్రి నుంచి ముఖ్యమైన మార్గాల్లో ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
Also read: PM Modi To Visit Hyderabad: మే 26న తెలంగాణకు ప్రధాని మోదీ.. మోదీ హైదరాబాద్ పర్యటన వెనుకున్న మర్మం ఏంటి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.