Thaman S: నెరవేరిన సజ్జనార్ తాపత్రయం.. దివ్యాంగ సింగర్‌కు అదిరిపోయే చాన్స్ ఇచ్చిన తమన్.. ఆర్టీసీ ఎండీ ఏమన్నారంటే..?
Rtc MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల ఆర్టీసీ బస్సులో అద్భుతంగా పాట పాడుతున్న దివ్యాంగుడి వీడియోను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది నిముషాల్లోనే తెగ వైరల్ గా మారింది. అంతే కాకుండా.. అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించాలని కూడా సజ్జనార్ స్పెషల్ గా రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Thamas s Gives chance to viral blind singer: ఐపీఎస్ సజ్జనార్ ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీకి ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. ఆయన గతంలో పోలీసు శాఖలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. అనేక కేసులను ఛేదించడంతో తనదైన మార్కు చూపించారు. ముఖ్యంగా సజ్జనార్ ను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా పిలుస్తుంటారు. మెడికో అత్యాచారం, హత్య ఘటనకు కారణమైన వారిని ఆయన ఎన్ కౌంటర్ చేయించారని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో యువత మాత్రం సాహో.. సజ్జనార్ సర్ ..అంటూ ఆయనపై పొగడ్తలు వర్షం కురిపించారు. ఇదిలా ఉండగా.. సజ్జనార్ ప్రస్తుతం తెలంగాణలో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తు.. సంస్థను లాభాల బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు పాడుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సులో ప్రయాణించేవారికి అనేక రాయితీలు సైతం ఇచ్చారు. అయితే.. సజ్జనార్ తాజాగా.. బస్సులో ప్రయాణిస్తుండగా.. ఒక దివ్యాంగ బాలుడు నితిన్ హీరోగా నటించిన శ్రీ ఆంజనేయం సినిమాలోని పాటకు అదిరిపోయే విధంగా పాటను పాడారు.
బస్సులో ఉన్న వారంతా కూడా బాలుడి పాటు ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో సజ్జనార్ ఆ దివ్యాంగుడికి అవకాశం ఇవ్వాలని కూడా ఎక్స్ లో వీడియో షేర్ చేసి.. కీరవాణి గారికి ట్యాగ్ చేశారు.దీంతో ఆ దివ్యాంగ బాలుడి వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా, ఫెమస్ మ్యూజిక్ సింగర్ తమన్ .. సదరు దివ్యాంగుడికి అవకాశం ఇస్తానని హమీ ఇచ్చారు. అంతేకాకుండా.. తెలుగు ఇండియన్ ఐడల్ లో అతనికి చాన్స్ ఇస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఆ పిల్లవాడిలో మంచి ప్రతిభ దాగుందని, కొన్నిసార్లు ఆ దేవుడు ఇలా మనుషుల్ని టెస్ట్ చేస్తారన్నారు. కానీ మనిషి మాత్రం.. మన ప్రయత్నాలు మనం చేస్తునే ఉండాలన్నారు. ఈ మేరకు తమన్.. తన ఎక్స్ లో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఇది కాస్త సజ్జనార్ కు తెలిసింది. దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. తమన్ కు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పినట్లు తెలుస్తొంది.
Read more: Golden Cobra: నిగ నిగ లాడుతున్న గోల్డెన్ కోబ్రా.. బైట పడ్డ అరుదైన సర్పం.. ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.