Snake video: విశాఖ పట్నంలోని నేవీ క్వార్టర్స్ లో అరుదైన సర్పం బైటపడింది. ఈ పాము బంగారు వర్ణంలో ఉంది. అంతే కాకుండా.. ఈ పాము బసలు కొడుతూ అక్కడున్న వారిని కాసేపు టెన్షన్ కు గురిచేసింది. ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
కొన్నిపాములు చాలా అరుదుగా బైటపడుతుంటాయి. పాములకు చెందిన ఘటనలు ఎక్కడ జరిగిన కూడా వార్తలలో ఉంటాయి. సాధారణంగా పాములు ఎలుకల్ని చంపి తింటుంటాయి. కొన్ని సందర్బాలలో ఇవి మనుషుల్ని కూడా కాటు వేస్తుంటాయి. పాములు కాటు వేసినప్పుడు టైమ్ కు మనం ఆస్పత్రికి వెళ్తే మాత్రం ప్రాణాపాయం నుంచి బై టపడొచ్చు.
ప్రస్తుతం వెరైటీ పాములు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పాముల్ని చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ పట్నంలో ఒక అరుదైన సర్పం బైటపడింది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
నేవీ యార్డులో బంగారు వర్ణంలో పడగ ఉన్న ఒక పాము వెలుగులోకి వచ్చింది.దీని పడగ బంగారు వర్ణంలో ఉంది. పడగ విప్పుతూ అక్కడున్న వారికి టెన్షన్ పెట్టిస్తుంది. ఈ పాములను చూడగానే అక్కడున్న వారు తమ ఫోన్ లలో వీడియోలు తీసుకున్నారు.
మనం సాధారణంగా నలుపు, గోధుమ రంగు పాముల్ని చూస్తుంటాం. అయితే.. చాలా అరుదుగా శ్వేత నాగును కూడా చూస్తుంటాం. అయితే.. ఇక్కడొక గోల్డెన్ రంగు పడగ ఉన్న పాము హల్ చల్ చేసింది.
దీన్ని చూసేందుకు విశాఖలోని నేవీ ప్రాంతంలోని ప్రజలు ఆసక్తి చూపించినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.
కార్తీక మాసంవేళ అరుదైన బంగారు వర్ణం పాము వెలుగులోకి రావడం ప్రస్తుతం వార్తలలో నిలిచింది. దీంతో అక్కడున్న వారు పామును చూడగానే స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పామును పట్టుకుని అడవిలో వదిలేసినట్లు తెలుస్తొంది.