Tomato prices, Onion prices latest updates: పెరిగిన టమాట ధరల నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించేలా లేదు. మరో రెండు నెలల పాటు టమాట ధరలు పెరుగుదలకు బ్రేక్ పడేలా లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. క్రిసిల్ అనే రేటింగ్స్ ఫర్మ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇంకొద్ది రోజుల్లో ఉల్లిగడ్డ ధరలు దిగొచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. టమాట ధరల విషయంలో మాత్రం మరో రెండు నెలల పాటు ధరలు  (Onion price hike) పెరగడమే తప్ప తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో టమాట పంటలు చేతికొస్తాయి. అయితే, భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ మూడు రాష్ట్రాల్లోని టమాట పంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో ప్రతీ ఏడాది వచ్చే దిగుబడి స్థాయిలో ఈసారి టమాట దిగుబడి లేదు. సరఫరాలో కొరత ఏర్పడటంతో ఉన్న పంటకే భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా టమాట ధరలు (Reason behind tomoto price hike) అమాంతం ఆకాశాన్నంటాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Also read : Rain Alert: అండమాన్ తీరంలో అల్పపీడనం...ఏపీ, తమిళనాడులకు భారీ వర్ష సూచన!


కర్ణాటకలో టమాట పంటలు పూర్తిగా దెబ్బతినడంతో మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కర్ణాటకకు టమాట సరఫరా (Tomato supply) అవుతున్నట్టు క్రిసిల్ రేటింగ్స్ ఫర్మ్ తమ నివేదికలో పేర్కొంది. 


Tomato crops - మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి టమాట పంట:
2022 జనవరి మొదటి వారం నాటికి మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి టమాట పంట మార్కెట్‌కి వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో పండే టమాట పంట దేశవ్యాప్తంగా ఉన్న చాలా మార్కెట్లకు చేరుతుంది. ఆ తర్వాతే టమాట ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 


Onion Price reduction - తగ్గనున్న ఉల్లిపాయ ధరలు:
ఉత్తరాదిన పండే ఉల్లి పంట మరో 10-15 రోజుల్లో మార్కెట్‌కి చేరే అవకాశం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా మరో రెండు వారాల్లో ఉల్లిపాయ ధరలు దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రిసిల్ రేటింగ్స్ ఫర్మ్ వెల్లడించింది. 


మహారాష్ట్రలో ఆగస్టులో వర్షాభావంతో పంటలు ఆలస్యం కావడం ఒక ఎత్తయితే.. పంటలు చేతికొచ్చే సమయంలోనే భారీ వర్షాలు (Heavy rains in Maharashtra) కురవడంతో పండిన పంటలు కాస్తా దెబ్బతిన్నాయి. వెరసి టమాట ధరలు అమాంతం పెరుగుతూ వచ్చాయని క్రిసిల్ స్పష్టంచేసింది.


Also read : Sirivennela: సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ రిలీజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook