Heavy rains: ముంబైని ముంచెత్తిన వర్షాలు, పొంచి ఉన్న వరద ముప్పు

దేశ ఆర్ధిక రాజధాని ముంబైని భారీ వర్షాలు మరోసారి ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా..వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Last Updated : Sep 23, 2020, 08:19 PM IST
Heavy rains: ముంబైని ముంచెత్తిన వర్షాలు, పొంచి ఉన్న వరద ముప్పు

దేశ ఆర్ధిక రాజధాని ముంబై ( Mumbai ) ని భారీ వర్షాలు ( Heavy rains ) మరోసారి ముంచెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా..వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ ( IMD ) హెచ్చరించింది. 

మహారాష్ట్ర ( Maharashtra ) రాజధాని నగరం ముంబైలో  భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్నించి ఎడతెరిపి లేని భారీ వర్షాలతో ముంబై నగరం నిండిపోయింది. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరో 24 గంటల వరకూ ఇంతకంటే భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరానికి వరద ముప్పు ఉందని తెలిపింది. దాంతో రైలు సర్వీసుల్ని నిలిపివేశారు. సెంట్రల్, హార్బర్ లైన్లలో రాకపోకలు నిలిచిపోయినట్టు బీఎంసీ వర్గాలు తెలిపాయి. ముంబై హైకోర్టు కూడా సెలవు ప్రకటించింది. 

ముంబైలోని పశ్చిమ ప్రాంతంలో ( Mumbai west ) 286.4 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరిక జారీ అయింది. భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాల్నించి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  Also read: Bhiwandi Building Collapse: 35కి చేరిన భీవండి భవనం మృతుల సంఖ్య

Trending News