COVID-19 tests in Telangana | హైదరాబాద్‌: తెలంగాణలో గురువారం కొత్తగా 352 కరోనావైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసులలో  జీహెచ్‌ఎంసీ (GHMC)  పరిధిలోనే 302 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 17, మేడ్చల్ జిల్లాలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంచిర్యాలలో 4, జనగాం జిల్లాలో 3, వరంగల్ అర్బన్ జిల్లాలో 3, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున, ఖమ్మం, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల ( Coronavirus positive cases) సంఖ్య 6,027కి చేరింది. TS high court: కరోనా పరీక్షలపై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు, సూచనలు )


గురువారం  కరోనావైరస్‌తో ముగ్గురు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 195 కు చేరింది. రాష్ట్రంలో ఇవాళ 230 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు అలా కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 3301 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 2,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం రాత్రి ఓ హెల్త్ బులెటిన్ ( Health bulletin) విడుదల చేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..