COVID-19 updates | హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 219 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలోనే 189 కేసులు ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 13, వరంగల్ అర్బన్ జిల్లాలో 4, వరంగల్ రూరల్ -3, మేడ్చల్ జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి. మిగతా వాటిలో మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి భువనగిరి, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున ఉన్నాయి. ఇవాళ గుర్తించిన కరోనా పాజిటివ్ కేసులతో ( Coronavirus) కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య మొత్తం 5,193 కి చేరింది. వీళ్లలో వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి స్వస్థలాలకు తిరిగొచ్చిన వారు 449 మంది (Migrants) ఉన్నారు. Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 187కి చేరింది. మొత్తం 2,766 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 2,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 



హైదరాబాద్ పేట్లబుర్జులోని ప్రసూతి దవాఖానలో 32 మందికి కరోనా సోకినట్టు సోమవారం నిర్ధారణ అయింది. వారిలో 14 మంది వైద్యులు కాగా 18 మంది ఆస్పత్రిలో సేవలు అందించే ఇతర సిబ్బంది ఉన్నట్టు సమాచారం. మరోవైపు మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కరోనాబారిన పడినట్టు వైద్యులు గుర్తించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, జనగాం ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తర్వాత వరుసగా కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తానే. వరుసగా ముగ్గురు ప్రజాప్రతినిధులకు కరోనా పాజిటివ్ తేలడంతో ప్రజాప్రతినిధులు అంతా ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.