Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుపై కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ తో పొత్తు సమస్యే లేదని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా.. జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిపి పోటే చేసే అవకాశాలు ఉన్నాయనే వాదన ఉంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో బీజేపీని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పార్టీ నేతలతో సమావేశమై చర్చలు జరిపారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్.. కాంగ్రెస్ తోనూ పొత్తుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాతీయ రాజకీయాల్లో ఒక రకమైన వాతావరణం ఉండగా.. తెలంగాణలో మాత్రం సీన్ మరోలా ఉంది. గత ఎనిమిదన్నర ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా సాధ్యమనే వాదనలు ఉన్నాయి. తాజాగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపై స్పందించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు అనేది కలలో కూడా జరగదని తేల్చి చెప్పారు. కేసీఆర్ ఎనిమిది ఏళ్ల పాలన పాపాలు మోయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోయే పరిస్థితి ఉండదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ ను ఖతం చేయడానికే కేసీఆర్ కుట్రలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ను వీక్ చేయాలనే లక్ష్యంతోనే కావాలనే బీజేపీని కేసీఆర్ ఎంకరేజ్ చేశారన్నారు రేవంత్ రెడ్డి. కాని ఇప్పుడు ఇదే కేసీఆర్ కు శాపంగా మారిందన్నారు. తాను లేపిన కమలం పార్టీనే ఆయనను టార్గెట్ చేస్తుందని అన్నారు. తెలంగాణ బీజేపీలో గెలిచే మొనగాళ్లు ఎంత మంది ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్ని కుట్రలు చేసినా.. రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా బీజేపీకి 10 సీట్లు రావడమే గగనమన్నారు రేవంత్ రెడ్డి. 


Also Read: Party Donations:చిన్న గుడిసెలో పార్టీ ఆఫీస్.. రెండేళ్లలో 2 వందల కోట్ల విరాళం! మన దేశంలో జోరుగా మనీ లాండరింగ్ దందా..


Also Read:  AP CABINET: కేబినేట్ లో మార్పుల దిశగా సీఎం జగన్.. వేటు పడే మంత్రులు వీళ్లేనా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి