TPCC Chief Revanth Reddy fires on KTR: దశాబ్ది దగా నిరసనలు తెలువుతున్న కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులతో కేసీఆర్ రాజ్యాన్ని నడపాలని అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. హాజ్ యాత్రికులను పంపడానికి వెళుతున్న షబ్బీర్ అలీని గృహ నిర్బంధం చేయడం సరికాదన్నారు. తెలంగాణ అమరుల స్మారకం చూడగానే వారి పోరాటాలు, త్యాగాలను గుర్తు చేయాలని.. అమరుల త్యాగాలను రాజకీయ స్వార్థానికి కేసీఆర్ ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లు వ్యవహరిస్తున్నారని.. అమరుల బలిదానాలను కేసీఆర్ అవమానిస్తున్నారని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"తెలంగాణ అమరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి జూన్ 17, 2017న నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. డిజైన్, అంచనాల కోసం, పనులను పరిశీలించడానికి 6 శాతం ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. జూన్ 28, 2018న నిర్మాణం కోసం 63 కోట్ల 75 లక్షలకు టెండరు ప్రకటన ఇచ్చారు. కేసీ పుల్లయ్య కంపెనీ టెండరు దక్కించుకుంది. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్‌తో కలిశాక కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌గా మారింది. ఈ కంపెనీ ప్రొద్దుటూరు, కడప జిల్లాకు చెందిన వారిది. తేలుకుంట్ల శ్రీధర్ కేటీఆర్ స్నేహితుడు. రూ.80 కోట్ల అగ్రిమెంట్ కాస్త 127 కోట్ల 50 లక్షలకు పెంచారు. అయినా సరిపోదని అంచనా 158.85 కోట్లకు పెంచారు. ఆ తరువాత 179 కోట్ల 5 లక్షలకు అంచనా పెంచారు.


Also Read: Private Video Call: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో న్యూడ్‌ కాల్‌ వరుడికి వీడియో లీక్‌.. చివరికి ఏం జరిగిందో తెలుసా?


కేటీఆర్‌ను బాటా చెప్పులతో కొట్టినా ఆయన పాపాలు తొలగవు. ఇంత ఖర్చు చేసి కట్టిన స్మారకంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని రాసి సరిపెట్టారు. శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రంలో శిలాఫలకాలపై సీఎం కేసీఆర్  పేరు ఎందుకు పెట్టాలి..? చరిత్రను మలినం చేయడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలి. అమరుల స్మారకం అంటే తెలంగాణ అమరుల చరిత్ర కళ్లముందు మెదిలేలా ఉండాలి. ఒక శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య.. వందలాది మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలి. పవితమైన అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారు.." అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.


కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1569 మంది అమరుల పేర్లు శిలాశాసనంలో పొందుపరుస్తామని తెలిపారు. కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన అమరుల కుటుంబాలను గుర్తించి రూ.25 వేలు నెలకు పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 9న 1569 మంది కుటుంబాలను పిలిచి సోనియా గాంధీ కుటుంబ సభ్యులతో సహపంక్తి భోజనాలు చేయిస్తామని చెప్పారు. తెలంగాణ సాధన సమరయోధులుగా వారికి గుర్తింపు అందిస్తామన్నారు.  


Also Read: Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరికను కన్ఫార్మ్ చేసిన పొంగులేటి.. మా మధ్య సీట్లు ఒప్పందం లేదు


బండి సంజయ్ మానసిక స్థితి నేను అర్థం చేసుకోగలనని అన్నారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్  కేఏ పాల్‌లాగే మాట్లాడుతున్నారని.. ఆయన మాటలను అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదన్నారు. ఆయనపై సానుభూతి వ్యక్త పరచడం తప్ప.. ఆయన మాటలను సీరియస్‌గా తీసుకోలేమని అన్నారు.


Also Read: Maa Awara Zindagi: బిగ్‌బాస్ శ్రీహాన్ 'మా ఆవారా జిందగీ' వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి