Maa Awara Zindagi: బిగ్‌బాస్ శ్రీహాన్ 'మా ఆవారా జిందగీ' వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే..?

Maa Awara Zindagi Release Date: మా ఆవారా జిందగీ మూవీని ఈ నెల 23న రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని తెలిపారు. 100% ఫన్ 0% లాజిక్ అలరిస్తామని చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2023, 03:20 PM IST
Maa Awara Zindagi: బిగ్‌బాస్ శ్రీహాన్ 'మా ఆవారా జిందగీ' వచ్చేస్తోంది.. రిలీజ్ ఎప్పుడంటే..?

Maa Awara Zindagi Release Date: బీటెక్ సాధారణంగా నాలుగేళ్లలో పూర్తవుతుంది.. కానీ ఆ నలుగురు కుర్రాళ్లకు మాత్రం 8 ఏళ్లు పట్టింది. అంతకష్టపడి బీటెక్ పట్టా అందుకుని బయటకు వచ్చినా.. అటు ఉద్యోగాలు దొరక్క.. ఇటు ఇంట్లో వాళ్ల సమాధానం చెప్పుకోలేక ఎలా ఇబ్బంది పడ్డారనే కాన్సెప్ట్‌తో రూపొందించిన మూవీ మా ఆవారా జిందగీ. దేపా శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బిగ్ బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే తదితురులు కీలక పాత్రలు పోషించారు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించారు. 100% ఫన్ 0% లాజిక్ అంటూ ఆడియన్స్‌ను నవ్వించేందుకు రెడీ అవుతున్నారు. ప్రతీక్ నాగ్ మ్యూజిక్ అందించగా.. కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 23న గ్రాండ్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ దేపా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ... ఫన్ ఓరియెంటెడ్‌గా.. యూత్ ఫుల్ కథాంశంతో మా ఆవారా జిందగి సినిమాను రూపొందించినట్లు తెలిపారు. నేటితరం ప్రేక్షకులకు నచ్చే విధంగా కామెడీ సినిమాలో ఉంటుందన్నారు. ఎక్కడా బోర్ కొట్టకుండా తెరకెక్కించామని.. ప్రేక్షకులు థియేటర్‌లో హాయిగా నవ్వుకుంటారని చెప్పారు. ఈ నెల 23న విడుదల కానున్న తమ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. 

నటుడు శ్రీహన్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ నుంచి  వచ్చిన తర్వాత డైరెక్టర్  శ్రీకాంత్ రెడ్డి చెప్పిన స్టోరీ నచ్చడంతో ఈ మూవీ చేసినట్లు తెలిపాడు. ఇందులో కాస్త బోల్డ్ సబ్జెక్ట్ ఉంటుందని.. తన నుంచి ఎవరూ ఇలా ఊహించి ఉండరని చెప్పాడు. తనను ఇష్టపడే వాళ్ల తన నటనను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇలాంటి బోల్డ్ కంటెంట్ మూవీ చేయాలంటే  ధైర్యం ఉండాలని.. తమను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు. 

మరో నటుడు అజయ్ మాట్లాడుతూ.. జబర్దస్త్, పటాస్‌ షోలతో తనను ప్రేక్షకులు ఆదరించారని.. మొదటిసారి సినిమాలో నటిస్తున్నానని చెప్పాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నాడు. తమ సినిమాను చూసి ఆడియన్స్  అందరూ పెద్ద హిట్ చేయాలని యాక్టర్ చెర్రీ కోరాడు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్స్‌గా శ్యామ్ ప్రసాద్ వి., ఉరుకుంద రెడ్డి వ్యవహరించారు. ఎడిటింగ్ బాధ్యతలను సాయిబాబు తలారి నిర్వహించారు.  

Also Read: YS Sharmila: కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..? జోరుగా ప్రచారం  

Also Read: Bandi Sanjay: సింగిల్‌గానే పోటీ చేస్తాం.. జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News