Revanth Reddy Indravelli Meet: ముఖ్యమంత్రి అయ్యాక ఇన్నాళ్లు పరిపాలనపై దృష్టి సారించిన రేవంత్‌ రెడ్డి ఇకపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ, విదేశీ పర్యటనలతోపాటు పాలనా యంత్రాంగం, శాఖలపై సమీక్ష చేపట్టిన రేవంత్‌ రెడ్డి ఇకపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. సీఎం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రేవంత్‌ జిల్లా పర్యటనలు చేయలేదు. కనీసం సొంత నియోజకవర్గం, సొంత గ్రామంలో కూడా పర్యటించలేదు. ప్రభుత్వాన్ని చక్కదిద్దడం.. పరిపాలనపై అవగాహన రావడంతో ఇక ప్రజల మధ్య వెళ్లనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఇంద్రవెల్లి పర్యటనతో మొదలై అనంతరం ఇతర జిల్లాలు ఉంటాయని తెలిపారు. ఇంద్రవెల్లి సభకు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తునన తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. 60 రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చేలా నాతలు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.


ఇదే సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పదేళ్ల పాలనపై విమర్శించారు. ఎన్డీయే పాలనతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల హక్కుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను గుర్తు చేశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్ వంటి ప్రాజెక్టుల గురించి పదేళ్లుగా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. 


నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి వందలాది మంది రైతులు చనిపోయినా ప్రధాని మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను కూల్చడంపైనే దృష్టి సారించిందని విమర్శించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: Konda Surekha: జగన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అక్క.. ఏపీ రాజకీయాల్లోకి కొండా సురేఖ
 


Also Read: Telangana High Court: తెలంగాణలో అనూహ్య మలుపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి