Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రాళ్ల దాడి జరిగింది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ప్రస్తుతం జనగామ జిల్లాలో పర్యటిస్తున్నారు బండి సంజయ్.  దేవరుప్పల సభలో సంజయ్ ప్రసంగిస్తుండగా.. అక్కడికి చేరుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షమ జరిగింది. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. బండి సంజయ్ పై రాళ్ల దాడికి యత్నించారు. ఇరు వర్గాల రాళ్ల దాడితో దేవరుప్పలలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. దాడి ఘటనతో బండి సంజయ్ పాదయాత్రలో హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికల్లో వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తనపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించారు బండి సంజయ్. పోలీస్ సెక్యూరిటీని తిరస్కరించారు. తన భద్రతను బీజేపీ కార్యకర్తలే చూసుకుంటారని చెబుతున్నారు. అయితే సెక్యూరిటీని కొనసాగించాలని బండి సంజయ్ కు నచ్చచెబుతున్నారు పోలీసులు. పోలీస్ కమిషనర్ తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చోవాలని అన్నారు. డీజీపీతో నేరుగా ఫోన్లో మాట్లాడారు బండి సంజయ్ కుమార్. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అని నిలదీశారు. కేసీఆర్ ఉండేది ఇంకో 6 నెలలే అన్నారు బండి సంజయ్. తక్షణమే పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా చూడాలన్నారు. లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వెంటనే స్పందించాల్సిందే... లేనిపక్షంలో గాయపడ్డ కార్యకర్తలను తీసుకుని మీవద్దకొస్తానంటూ సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో డీజీపీకి డెడ్ లైన్ పెట్టారు బండి సంజయ్.


Read also: CM Jagan: మీడియా కొందరికి భజన చేస్తుందని సమరయోధులు ఊహించారా? జెండా పండుగలో సీఎం జగన్ ప్రశ్న..


Read also: Tirumala: భక్తులకు 40 గంటలు.. మంత్రి అనుచరులకు నిమిషాల్లో దర్శనం! తిరుమలలో వైసీపీ నేతల దౌర్జన్యం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి