Etela Rajender: ఊహించిందే జరగబోతోంది. మాజీ మంత్రి, టీఆర్ఎస్ రెబెల్ నేత ఈటెల రాజేందర్ కమలం గూటికి చేరనున్నారు. సొంతంగా పార్టీ పెట్టనున్నారనే ప్రచారానికి చెక్ పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ (Etela Rajender) వ్యవహారంలో స్పష్టత వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉద్వాసనకు గురి కావడం, పార్టీకి రాజీనామా చేయడం పరిణామాలు గత కొద్దికాలంగా చర్చనీయాంశమయ్యాయి. దేవరయాంజల్ భూముల కుంభకోణం కేసులో ఈటెలపై ఆరోపణలు వచ్చాయి.ఈ తరుణంలో టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సొంత పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగింది. మరోవైపు బీజేపీలో చేరనున్నారనే ప్రచారం కూడా సాగింది. చివరికి ఈటెల రాజేందర్ భవితవ్యంపై స్పష్టత వచ్చింది. 


టీఆర్ఎస్ మాజీ నేత, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మరికొద్ది గంటల్లో బీజేపీ (BJP) తీర్ధం పుచ్చుకోనున్నారు. బీజేపీ జాతీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda ) సమక్షంలో రేపు అంటే ఈనెల 14వ తేదీ ఉదయం 11.30 గంటలకు కాషాయ కండువా కప్పుకోనున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకోనున్నారు. ఈటెల రాజేందర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ తదితరులు సైతం బీజేపీలో చేరనున్నారు. 


Also read: Petrol prices today: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ, ఏపీలో పెట్రోల్ ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook