MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‎రెడ్డికి భద్రత పెంచింది తెలంగాణ ప్రభుత్వం. జీవన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. సెక్యూరిటీని పెంచుతూ.. 4+4 గన్ మెన్స్ కేటాయిస్తూ  తాజాగా ఉత్తర్వులు  జారీచేసింది. ఆర్మూర్, హైదరాబాద్లో ఆయనకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కేటాయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే ఎమ్మెల్యే జీవన్‎రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవన్ రెడ్డిపై హత్యాత్నం కేసులో బుధవారం మరో నలుగురిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌లను అరెస్టు చేసినట్లు డీసీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.  ఈ నెల 6న ప్రధాన నిందితుడు ప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


నిందితులు నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్రలోని నాందేడ్‌లో కత్తి, బిహార్‌లో దేశవాళీ తుపాకీ కొనుగోలు చేసినట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. దేశవాళీ తుపాకీ, ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేసేందుకు సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌ కలిసి ప్రసాద్‌కు సహకరించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.. బిహార్‌కు చెందిన మున్నా కుమార్‌ నుంచి 60 వేల రూపాయలకు  ప్రసాద్ గన్ కొన్నాడని వెల్లడించారు. ప్రసాద్ కు తుపాకీని అమ్మిన మున్నా ఇంకా దొరకలేదన్నారు. ప్రసాద్‌ను కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు జీవన్ రెడ్డి.


ఈనెల 6న హైదరాబాద్ లోని జీవన్ రెడ్డి నివాసానికి   కిల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ వచ్చాడు. ఎమ్మెల్యేను కలవాలని చెప్పడంతో సెక్యూరిటీ సిబ్బంది అతనిని లోపలికి పంపించారు. తర్వాత ప్రసాద్, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం జరిగింది. ప్రసాద్ ను జీవన్ రెడ్డి నెట్టివేయడంతో అతని వద్ద తుపాకీ బయటపడింది. గన్ ను చూసిన జీవన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ప్రసాద్ ను పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్ పోలీసులు జీవన్ రెడ్డికి నివాసానికి వచ్చి ప్రసాగ్ గౌడ్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఐదు రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని పరామర్శించారు. బుధవారం సీఎం కేసీఆర్ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు.


Read also: YS Vijayamma: ఊపిరి పీల్చుకున్న సీఎం జగన్.. వైఎస్ విజయమ్మకు తప్పిన పెను ప్రమాదం


Read also: Munugode Byelection: ఎల్లుండి మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. టికెట్ రేసులో ముందున్న చెరుకు సుధాకర్?


 



 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook