Munugode Byelection: ఎల్లుండి మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. టికెట్ రేసులో ముందున్న చెరుకు సుధాకర్?

Munugode Byelection: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అస్తశస్త్రాలు బయటికి తీస్తోంది

Written by - Srisailam | Last Updated : Aug 11, 2022, 02:20 PM IST
  • మునుగోడుపై కాంగ్రెస్ ఫోకస్
  • ఎల్లుండి రేవంత్ రెడ్డి పాదయాత్ర
  • అభ్యర్థి ఎంపికపై పీసీసీ కసరత్తు
Munugode Byelection: ఎల్లుండి మునుగోడులో రేవంత్ రెడ్డి పాదయాత్ర.. టికెట్ రేసులో ముందున్న చెరుకు సుధాకర్?

Munugode Byelection: తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆయన రాజీనామాతో తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అస్తశస్త్రాలు బయటికి తీస్తోంది. మునుగోడు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇప్పటికే చండూరులో సభ నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఎల్లుండి మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా పాదయాత్ర చేయనున్నారు. పాదయాత్రలో స్థానిక ప్రజలతో మమకేం కానున్నారు రేవంత్ రెడ్డి.

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిపై ఫోకస్ చేసిన కాంగ్రెస్ పెద్దలు.. గాంధీభవన్ లో కసరత్తు చేస్తున్నారు. బుధవారం రోజంతా సమావేశాలు నిర్వహించిన ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్.. గురువారం కూడా నాన్ స్టాప్ గా సమావేశాలు జరిపారు. మనిక్కమ్ ఠాగూర్ అధ్యక్షతన జరిగినన కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ,  ఏఐసీసీ సెక్రటరీలు నదీమ్ జావిద్ , చౌదరి , వర్కింగ్ ప్రెసిడెంట్లు మహేష్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు  రాంరెడ్డి దామోదర్ రెడ్డి , నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ , భువనగిరి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ , ఈరవత్రి అనిల్ పాల్గొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అభ్యర్థిపై ఎంపికైనా మాట్లాడారని తెలుస్తోంది. మునుగోడు టికెట్ రేసులో ఉన్న చెరుకు సుధాకర్ ను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలుపించుకుని మనిక్కమ్ ఠాగూర్ మాట్లాడం ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు టికెట్ రేసులో చెరుకు సుధాకర్ ముందున్నారనే టాక్ గాంధీభవన్ లో వినిపిస్తోంది.

రాజగోపాల్ రెడ్డి కి మాట్లాడే అవకాశం వచ్చిందంటే కాంగ్రెస్ వల్లే అన్నారు టీపీసీసీ ప్రచార కమిటి చైర్మెన్ మధుయాష్కీ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను ఐదు నిమిషాల్లో ఆమోదించడమే ఇందుకు సంకేతమన్నారు మధుయాష్కీ. మునుగోడులు ఎవరికి టికెట్ ఇచ్చిన అందరం కలిసి పని చేస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారని చెప్పారు. సర్వే ఆధారంగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు మధుయాష్కీ గౌడ్. మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ సచ్చిపోయిందంటున్న రాజగోపాల్ రెడ్డికి మాట్లాడే స్వేచ్ఛ  ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.

Read also: Mohan Babu: సాయిబాబా భక్తులు షిర్డీకి వెళ్లాల్సిన పని లేదు.. మోహన్ బాబు కామెంట్లపై దుమారం

Read also: Munugode Byelection: టీఆర్ఎస్, కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి.. అమిత్ షా టీమ్ సీక్రేట్ ఆపరేషన్! మునుగోడులో రోజుకో ట్విస్ట్....  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News