TRS COUNTER: పకోడీలు అమ్ముకోవాలన్న మోడీకి ఐటీ ఏం తెలుసు!
TRS COUNTER: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణలో రాజుకున్న రాజకీయ సెగలు ఇంకా చల్లారడం లేదు. బేగంపేట సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
TRS COUNTER: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణలో రాజుకున్న రాజకీయ సెగలు ఇంకా చల్లారడం లేదు. బేగంపేట సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అన్నారు ప్రభుత్వ బాల్క సుమన్. మోడీ నుంచి తెలంగాణకు మేలు జరుగుతుందని ఆశించలేమన్నారు. కుటుంబ రాజకీయాల గురించి మోడీ మాట్లాడటం సిగ్గు చేటన్న సుమన్.. బీజేపీ నిండా కుటుంబాల వారసులే ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ ది త్యాగాల కుటుంబం అయితే బీజేపీది భోగాల కుటుంబమని మండిపడ్డారు.
కేంద్రం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా యువత ను ఏం చేస్తారని నిలదీశారు బాల్క సుమన్. యువతను కత్తులతో నృత్యం చేయించడమే ఉన్నత శిఖరాలను తీసుకెళ్లడమా మోడీ అంటూ ప్రశ్నించారు. కరోనా సమయంలో గంగా నది లో శవాలు తేలెలా చేయడమే మోడీ గొప్పతనమా అని బాల్క సుమన్ సెటైర్లు వేశారు. పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ లను తాము ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తే మోడీ.. ఆదానీ కి కట్టబెట్టారని ఆరోపించారు. ఆదానీ, అంబానీలకు దేశాన్ని అమ్మేయడానికి మోడీకి ప్రజలు అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు. అద్వానీకి పంగ నామాలు పెట్టిన ఘనుడు మోడీ అన్నారు. బండి సంజయ్ ఉర్దూను రద్దు చేయమనడం కాదు.. దమ్ముంటే ప్రధానితో చేయించు అంటూ బాల్క సుమన్ సవాల్ చేశారు.
మంత్రి కేటీఆర్ దావోస్ లో దుమ్ము రేపుతుంటే.. ప్రధాని మోడీ తెలంగాణపై దుమ్మెత్తిపోయడానికి హైదరాబాద్ వచ్చారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. మోడీ ప్రభుత్వం మేకిన్ ఇండియా ను ఫేక్ ఇండియా గా మార్చారని దుయ్యబట్టారు. మోడీ పెద్ద నటుడు, స్టంట్ మాస్టర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. ఎక్కడికి పోతే ఆ పాట పాడి.. రంగు రంగుల దుస్తులతో అలరించే నటుడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పకోడిలు అమ్ముకోవాలని చెప్పిన మోడీ.. ఐటీ గురించి మాట్లాడటం వింతగా ఉందని జీవన్ రెడ్డి సెటైర్ వేశారు. తెలంగాణ నుంచి బీజేపీ మాయం కావడం ఖాయమన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం పోవడం తధ్యమన్నారు.
తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసేలా ప్రధాని మోడీ మాట్లాడారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణకు ఏం చేశామో చెప్పలేని దుస్థితి మోడీదన్నారు.మోడీ పాలనలో తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదన్నారు.కేసీఆర్ కాళేశ్వరం కట్టారు.. మోడీ చేసిందేమిటని చందర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తెలంగాణ లో ఉగ్రవాదులుగా వ్యవహరిస్తున్నారు.. వారిని ప్రజలే వెలి వేస్తారని అన్నారు. బీజేపీని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
READ ALSO: TDP MAHANADU: ఉన్మాది చేతిలో పోలీసులు బలి కావొద్దు.. మహానాడు ప్రసంగంలో చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook