Kadium Vs Rajaiah: ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు భగ్గుమంటోంది. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. మొదటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతుండగా.. తాజాగా ముదిరినట్లు కనిపిస్తోంది. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి 361 మంది మావోయిస్టులను బలి తీసుకున్నారని ఆరోపించారు. కడియం శ్రీహరి  మంత్రిగా ఉన్న సమయంలోనే  ఈ హత్యలు జరిగాయన్నారు. ఒక్క స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోనే ఇంతమంది చనిపోయారని తాటికొండ రాజయ్య అన్నారు.  చిల్పూర్ మండలం చిన్నపెండ్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజయ్య చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అధికార పార్టీలో సెగులు రేపుతున్నాయి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేసీఆర్  తనకు దేవుడన్న రాజయ్య.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి తానుపూజారిని చెప్పారు. స్టేషన్ ఘనపూర్ నా అడ్డా.. ఇక్కడి ఎవరినీ అడుగుపెట్టనివ్వబోనంటూ శపథం చేశారు. స్టేషన్ ఘనపూర్ లో ఎవరిని అడుగుపెట్టనీయనంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు కడియం శ్రీహరిని ఉద్దేశించి చేసినవేననే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి తన కూతురు కావ్యను బరిలో నిలపాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. కొన్ని రోజులుగా కడియం ఈ నియోజకవర్గంలో జోరుగా తిరుగుతున్నారు. తన కేడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్గపోరు మళ్లీ తీవ్రమైందని తెలుస్తోంది.


ఆదివారం ఓ సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే రాజయ్య..  కడియం శ్రీహరి టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీలతో అభివృద్ధి జరగదని, ఎమ్మెల్యేలతోనే జరుగుతుందని అన్నారు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురికిపింఛన్ కార్డుల పంపిణీ చేశారు రాజయ్య. ఈ సందర్భంగా మాట్లాడిన రాజయ్య.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల ద్వారానే అందుతాయని..మ్మెల్సీల నుంచి కాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడాలంటే ఎమ్మెల్యేలే ఉండాలన్నారు. కల్యాణ లక్ష్మీ రావాలన్నా, అభివృద్ధి పనులు చేపట్టాలన్న అందుకు ఎమ్మెల్యేగా తాను ప్రతిపాదిస్తేనే జరుగుతుందని రాజయ్య చెప్పారు. స్థానికేతరులు, ఎమ్మెల్సీలు  ఇక్కడ చేసేదేమి ఉండదంటూ హాట్ కామెంట్స్ చేశారు తాటికొండ రాజయ్య.


గతంలోనూ కడియం, తాటికొండ మధ్య పలుసార్లు మాటల యుద్ధం సాగింది. తాజాగా ఘటనలతో స్టేషన్ ఘనపూర్ నియోజకర్గంలోని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఎవరికి సపోర్డ్ చేస్తే ఏమవుతుందో తెలియని గందరగోళంలో పడుతున్నారు.


Read also: Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ లో సీబీఐ దూకుడు.. సిసోడియా బ్యాంక్ లాకర్లు ఓపెన్.. నెక్స్ట్ కవితేనా?


Read also: Suicide Case: బలవంతంగా 'బీఫ్' తినిపించిన ప్రేయసి.. యువకుడి ఆత్మహత్య...  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి