TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
TRS MLAs Trap Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాల కేసు రిమాండ్ నివేదికలో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచి రాష్ట్రంలో రాజకీయ అనిశ్ఛిత పరిస్థితులను సృష్టించేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినట్టుగా కేసు నమోదు చేసిన పోలీసులు.. అవే అంశాలను రిమాండ్ నివేదికలో కీలకంగా ప్రస్తావించారు.
TRS MLAs Trap Case: నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్ అయ్యేలా నాలుగు రహస్య కెమెరాలు, రెండు వాయిస్ రికార్డర్లు ఉపయోగించినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు. హాల్‌లో రహస్య కెమెరాలు, రోహిత్ రెడ్డి కుర్తా జేబుల్లో రెండు వాయిస్ రికార్డర్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
ఫాంహౌజ్ హాళ్లో ఏర్పాటు చేసిన కెమెరాలను మ.3.05కి స్విచ్చాన్ చేశాం. మ.3.10కి నిందితులతో కలిసి రోహిత్ రెడ్డి హాళ్లోకి వచ్చారు. ఆ తర్వాత సా.4.10 గంటలకు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి, ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు వచ్చారు. సుమారు మూడున్నర గంటల పాటు బేరసారాలు జరిపేందుకు వచ్చిన నిందితులతో ఎమ్మెల్యేలు చర్చలు జరిపారు. సమావేశం పూర్తి కాగానే కొబ్బరి నీళ్లు తీసుకురా అని కోడ్ భాషలో సిగ్నల్ ఇవ్వాల్సిందిగా రోహిత్ రెడ్డికి ముందే చెప్పాం. మేము చెప్పినట్టుగానే కొబ్బరినీళ్లు తీసుకురా అని పైలట్ రోహిత్ రెడ్డి అనగానే లోనికి వెళ్లాం. ఒక్కో ఎమ్మెల్యేకు 50 వరకు ఇస్తామని నిందితులు చెప్పిన మాటలు వాయిస్ రికార్డర్లలో నమోదైంది.
కర్ణాటక, ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో పని పూర్తి చేశామని రామచంద్ర భారతి చెప్పిన మాటలు రికార్డయ్యాయి. తుషార్‌కు రామచంద్ర భారతి ఫోన్ చేసినట్లు వాయిస్ రికార్డర్లలో రికార్డయింది. తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్య విషయం మాట్లాడాల్సిందిగా సునీల్ కుమార్ బన్సల్‌కు ఒక సంక్షిప్త సమాచారాన్ని రామచంద్రభారతి ఎస్ఎంఎస్ రూపంలో పంపించారు. సునీల్ కుమార్ బన్సల్‌కు రామచంద్ర భారతి పంపించిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్‌ను రిమాండ్ నివేదికలో జతపరిచినట్టు పోలీసులు తెలిపారు.
25 మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంతోష్ బీజేపీ అనే పేరుతో సేవ్ చేసి ఉన్న ఫోన్ నంబరుకు రామచంద్ర భారతి వాట్సప్ మెసేజ్ పంపించాడని.. ఆ మెసేజ్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ సైతం తమ వద్ద పదిలంగా ఉన్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నందు డైరీలో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది ఎమ్మెల్యేల వివరాలు ఉన్నాయి. ఇక మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఈ ఆపరేషన్‌లో రోహిత్ రెడ్డికి సహకరించేందుకు వెళ్లారే తప్పించి ఇందులో వాళ్లకు ఏలాంటి పాత్ర లేదని పోలీసులు స్పష్టంచేశారు. బేరసారాలపై మీడియాలో వచ్చిన వార్తా కథనాలు, అనుమానాలకు సమాధానం బదులిచ్చినట్టుగానే నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఉండటం గమనార్హం.
Also Read : TRS MLAS BRIBE: కాంగ్రెస్ నేతలతోనూ నందకుమార్ చర్చలు! బీజేపీలో చేరికపై మల్ రెడ్డి రంగారెడ్డి క్లారిటీ
Also Read : CM KCR PRESS MEET: ఫాంహౌజ్ ఆపరేషన్ ఎపిసోడ్ పై కేసీఆర్ ప్రెస్ మీట్! బీజేపీ పెద్దలు బుక్కవుతారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి