TRS MLC Gutha Sukender Reddy Takes Charge As Legislative Council Chairman: తెలంగాణ శాస‌న‌మండ‌లి చైర్మ‌న్‌గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. మండ‌లి ఎన్నిక‌కు ఒకే ఒక్క నామినేష‌న్ రావ‌డంతో గుత్తా ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని చైర్మ‌న్ సీటు వ‌ద్ద‌కు మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌తో పాటు ప‌లువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మ‌న్ సీటులో ఆశీనులైన గుత్తాకు మంత్రులు పుష్ప‌గుచ్ఛం అందించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సేవలను అందరూ కొనియాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్సీ ప‌ద‌వీకాలం ముగియ‌డంతో ఆయ‌న స్థానంలో ప్రొటెం చైర్మ‌న్‌గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియ‌మించారు. ఆపై మండ‌లి ప్రొటెం చైర్మ‌న్‌గా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియామ‌కం అయ్యారు. శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా రెండోసారి నవంబర్ 22న ఎన్నికయ్యారు. నేడు రెండోసారి మండ‌లి చైర్మ‌న్‌గా ఆయన బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2019 సెప్టెంబ‌ర్ 11న తొలిసారిగా గుత్తా మండ‌లి చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2021 జూన్ మొద‌టి వారం వ‌ర‌కు ఆయన మండ‌లి చైర్మ‌న్‌గా సేవ‌లందించారు.


న‌ల్ల‌గొండ జిల్లా ఊరుమ‌డ్ల గ్రామంలో 1954 ఫిబ్ర‌వ‌రి 2న గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి జన్మించారు. ఆయన ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి డిగ్రీ ప‌ట్టా పొందారు. గుత్తా త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని క‌మ్యూనిస్టు పార్టీ నుంచి ప్రారంభించారు. క‌మ్యూనిస్టు పార్టీలో చురుకుగా ప‌ని చేసిన ఆయ‌న‌ అంచెలంచెలుగా ఎదిగారు. ఆపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో ప‌ని చేశారు. 2004 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున న‌ల్ల‌గొండ పార్ల‌మెంట్ స్థానం నుంచి గెలుపొందారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచే మ‌ళ్లీ ఎంపీగాఎంపికయ్యారు. 2014 ఎల‌క్ష‌న్స్‌లోనూ ఎంపీగా గెలుపొందారు. ఇక 2016 జూన్ 15న టీఆర్ఎస్ పార్టీలో చేరారు.


2018లో గుత్తా సుఖేంద‌ర్ రెడ్డిని సీఎం కేసీఆర్ రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించారు. 2019 ఆగ‌స్టులో ఎమ్మెల్యే కోటాలో తొలిసారిగా శాసనమండ‌లికి ఎన్నిక‌య్యారు. 2019 సెప్టెంబ‌ర్ 11న మండ‌లి చైర్మ‌న్‌గా ఆయన ఏక‌గ్రీవంగా ఎన్నియ్యారు. 2021 జూన్ 3న గుత్తా పదవీకాలం ముగిసింది. 2021 న‌వంబ‌ర్‌లో జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. ఈరోజు ఆ బాధ్యతలు స్వీకరించారు. 


Also Read: Vikram Release Date: మేకింగ్ వీడియో అదుర్స్.. 'విక్రమ్' వచ్చేస్తున్నాడు!!


Also Read: Rishabh Pant: కపిల్ దేవ్ 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన రిషబ్ పంత్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook