Kalvakuntla Kavitha in Dharmapuri: ధర్మపురిలో దసరా సంబరాలు, బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఎమ్మెల్సీ కవిత రాక సందర్భంగా ఆమెకు స్వాగతం పలికేందుకు ఇదే నియోజక వర్గానికి చెందిన ఆడ పడుచులు భారీ సంఖ్యలో బతుకమ్మలు, బోనాలతో తరలి వచ్చారు. అనంతరం ఆడపడుచులతో కలిసి కవిత బతుకమ్మ, కోలాటం సంబరాల్లో పాల్గొని సందడి చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావా వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ధర్మపురిలో అక్కాచెల్లెళ్లు ఇచ్చిన స్ఫూర్తితో వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర స్థాయిలో కోలాట పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిస్సులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పి స్థానికులలో జోష్ నింపే ప్రయత్నం చేశారు.


రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండగా ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ప్రకృతి ఆరాధిస్తూ తెలంగాణ ఆడపడుచులు ఘనంగా, వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండగ ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించిందన్నారు. బతుకమ్మ పండగతో తెలంగాణ సంస్కృతి విశ్వ వ్యాప్తమైందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయంలోనే సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగకు ఉన్న ప్రాశస్త్యాన్ని అందరి ముందుకు తీసుకు వచ్చారని.. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే బతుకమ్మ పర్వదినాన్ని అధికారికంగా జరుపుకోవటం మొదలు పెట్టి సీఎం కేసీఆర్ ఈ పండగకు ఉన్న ప్రాశస్త్యాన్ని మరింత పెంచారని అన్నారు. ప్రతీ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరుగుతోందని.. అలాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ ఆడ బిడ్డలకు ప్రభుత్వం తరపున బతుకమ్మ కానుకగా 350 కోట్ల రూపాయలు వెచ్చించి చీరలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.


యావత్ దేశమే కేసీఆర్ వైపు చూస్తోందన్న మంత్రి కొప్పుల... 
ప్రస్తుతం దేశ ప్రజలు అందరి చూపు సీఎం కేసీఆర్ వైపే ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పిన ఆయన.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలవ్వాలని కోరుకుంటున్నారని అన్నారు. మానవత్వంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తూ.. ఇచ్చిన మాటకు కట్టబడి ప్రజలకు మేలు చేస్తున్నారని ముఖ్యమంత్రిని కొనియాడారు. కేసీఆర్ ముందు చూపు వల్ల తెలంగాణలో గత ఎనిమిదేళ్లలో వ్యవసాయ రంగం రూపు రేఖలు, స్వరూపమే మారిందని అన్నారు. కేసీఆర్ (CM KCR) ముందుచూపు వల్లే దేశానికి తెలంగాణ  అన్నపూర్ణగా తయారైందని మంత్రి పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా లాంటి సంక్షేమ పథకాలు కల్పించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత కూడా తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని అన్నారు.


Also Read : Vijay Darda Meets CM KCR: తెలంగాణ సీఎంఓలో పొరపాటు.. నాలుక కర్చుకున్న అధికారులు.. అప్పటికే పబ్లిక్‌లోకి న్యూస్


Also Read : CM KCR Yadadri visit: సీఎం కేసిఆర్ యాదాద్రి, వరంగల్ పర్యటనల షెడ్యూల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి