నాలుగేళ్ల పాలన ట్రైలర్ మాత్రమే.. మళ్లీ అధికారంలోకి వస్తే త్రీ డీ స్క్రీన్ పై సినిమా - ఎంపీ కవిత
టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మహాకూటమిపై విమర్శల వర్షం కురిపించారు. ఆమె ఈ రోజు జగిత్యాల జిల్లాలో పర్యటన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకు ట్రైలర్ మాత్రమే చూశారని..రానున్న రోజుల్లో త్రీ డీ స్క్రీన్ పై అసలు సినిమా చూపిస్తామన్నారు. మరోసారి అధికారం కట్టబెడితే మరింత మెరుగైన పాలన అందిస్తామని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు.
కరప్షన్ కు పుట్టిన కవలలే కాంగ్రెస్, టీడీపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏర్పడిన మహాకూటమి ... మాయకూటమి అని ఎద్దేవ చేశారు. మహాకూటమిలోని కాంగ్రెస్ పార్టీకి కమిట్ మెంట్ లేదు... టీడీపీకి సెంటిమెంట్అంటే తెలియదని ఎద్దేవ చేశారు. ఎన్నికల్లో మహాకూటమికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమని కవిత జోస్యం చెప్పారు. కరప్షన్ కు పుట్టిన కవలలే కాంగ్రెస్, టీడీపీ..గత పాలనలో ఇది రుజువైందని ఈ సందర్భంగా కవిత ఆరోపించారు.