TRS District Presidents: టీఆర్‌ఎస్ పార్టీ జిల్లాల కొత్త అధ్యక్షులు వీరే..
KCR appoints TRS district presidents: తెలంగాణలోని 33 జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం. కొత్త అధ్యక్షుల జాబితాను ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.
TRS Party District Presidents: టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ (KCR) ప్రకటించారు. తెలంగాణలోని 33 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన వారిలో ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కూడా ఉన్నారు.
ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న ఎంపికయ్యారు. కుమ్రం భీం జిల్లాకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మంచిర్యాల జిల్లాకు బాల్క సుమన్, నిర్మల్ జిల్లాకు జి. విఠల్ రెడ్డిలు టీఆర్ఎస్ పార్టీ (TRS Party) అధ్యక్షులుగా నియమితులయ్యారు.
నిజామాబాద్ జిల్లాకు అధ్యక్షుడిగా ఎ.జీవన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎంకే ముజీబుద్దీన్ నియమితులు అయ్యారు. ఇక కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా జీవీ రామకృష్ణారావు, సుడా చైర్మన్ ఎంపికయ్యారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తోట ఆగయ్య ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లాకు అధ్యక్షుడిగా కే విద్యాసాగర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా కోరుకంటి చందర్, మెదక్ జిల్లాకు ఎం పద్మా దేవెందర్ రెడ్డి నియమితులయ్యారు.
ఇక సంగారెడ్డికి చింతా ప్రభాకర్, సిద్దిపేటకు కొత్త ప్రభాకర్ రెడ్డి (ఎంపీ), వరంగల్‌కు ఆరూరి రమేశ్, హనుమకొండకు దాస్యం వినయ్ భాస్కర్, జనగామకు పి.సంపత్ రెడ్డి, (జెడ్పీ చైర్మన్) జిల్లా అధ్యక్షులుగా (TRS Party District Presidents) ఎన్నికయ్యారు.
అలాగే మహబూబాబాద్ జిల్లాకు మాలోతు కవితా నాయక్ (ఎంపీ), ములుగు జిల్లాకు జగదీశ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు గండ్ర జ్యోతి అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాకు తాతా మధుసూదన్ (ఎమ్మెల్సీ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రేగా కాంతారావు అధ్యక్షులుగా నియమితులయ్యారు.
ఇక నల్లగొండ జిల్లాకు రమావత్ రవీంద్ర కుమార్, సూర్యాపేటకు బడుగుల లింగయ్య యాదవ్ (ఎంపీ), యాదాద్రి భువనగిరి జిల్లాకు కంచర్ల రామకృష్ణా రెడ్డి అధ్యక్షులుగా నియమితులయ్యారు.
అలాగే రంగారెడ్డి జిల్లాకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్ జిల్లాకు మెతుకు ఆనంద్, మేడ్చల్ జిల్లాకు శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ), హైదరాబాద్‌కు మాగంటి గోపినాథ్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులయ్యారు.
Also Read : Republic Day 2022: రిపబ్లిక్ డే పరేడ్ లో ఆకట్టుకున్న పలు రాష్ట్రాలు శకటాలివే!
మహబూబ్‌నగర్‌కు సి. లక్ష్మారెడ్డి, నాగర్ కర్నూల్‌కు గువ్వల బాలరాజు, జోగులాంబ గద్వాలకు బి. కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేటకు ఎస్. రాజేందర్ రెడ్డి, వనపర్తికి ఏర్పుల గట్టుయాదవ్ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులయ్యారు.
Also Read: Chris Gayle: ప్రధాని మోదీ నుంచి పర్సనల్ మెసేజ్: క్రిస్ గేల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.