గ్రేటర్ ఎన్నికల నగారా మోగింది. నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. అధికారపార్టీ ప్రచార వూహాన్ని ఖరారు చేసింది. సాయంత్రంలోగా తొలి జాబితాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మజ్లిస్ పార్టీతో కలిసి ఎన్నికల ప్రచార వ్యూహాన్ని సిద్దం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


దుబ్బాక ఉప ఎన్నిక ( Dubbaka Bypolls ) లో  ఓటమి నుంచి కోలుకుని..గ్రేేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( Greater Hyderabad Municipal corporation Elections ) ఎన్నికలపై దృష్టి సారించింది టీఆర్ఎస్ ( TRS ) . కార్యకర్తల్ని కదనరంగానికి పంపుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని మొహరించనుంది. మినీ అసెంబ్లీని తలపించే గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఇప్పటికే పార్టీ నేతలకు సూచించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ).  మధ్యాహ్నం రెండు గంటలలకు మరోసారి తెలంగాణ భవన్ లో పార్టీ పార్లమెంటరీ, లెజిస్లేచర్ సమావేశమైంది. 


ఇప్పటికే నామినేషన్ల పర్వం ( Nominations ) ప్రారంభం కావడంతో ఇవాళ అభ్యర్ధుల తొలి జాబితాను విడుదల చేసేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. డివిజన్ల వారీగా రిజర్వేషన్లను దృష్టిలో ఉంచుకుని..అభ్యర్ధుల పనితీరు, ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధుల బలం, బలహీనత, సామాజిక సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని గెలుపు గుర్రాల్ని సిద్ధం చేసింది టీఆర్ఎస్. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలో విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ ( BJP ) గ్రేటర్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 


85 శాతం సిట్టింగ్ అభ్యర్ధులకే మరోసారి టికెట్ దక్కనుందని తెలుస్తోంది. టికెట్ దక్కకపోతే పార్టీ వీడే అవకాశమున్నవారిని కూడా పార్టీ యంత్రాంగం గుర్తించింది. పార్టీ వీడకుండా చూసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరో డివిజన్ ఇన్ ఛార్జ్ కు అప్పగించారు. అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ ను కూడా రంగంలో దించనున్నారు. 


ఎవరు ఏ ప్రాంతలో ఇన్ ఛార్జీలుగా ఉంటారనేది ఇవాళ నిర్ణయం కానుంది. ఇన్‌చార్జిలుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయి నుంచి జడ్పీ ఛైర్మన్లు, మున్సిపల్‌ చైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పం చ్‌లు, సహకార సంఘాల చైర్మన్లతో పాటు చురుకైన కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తారు. Also read: GHMC Elections 2020: తెరాసకు ఓటు వేయమని కోరిన కల్వకుంట్ల కవిత